పసి ప్రాణాలు పోతే ఎలుకలపై నిందలా?.. ఎవరి కోసం ఈ తప్పుడు రిపోర్టులు? : కేటీఆర్
రిమ్స్ విచారణ నివేదికపై ‘ఎక్స్'లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ ఫైర్.. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే ఘటనకు కారణమన్న కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో ఐదుగురు పసికందులు చనిపోతే ఎలుకలపై నెపం నెట్టడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దవాఖానలోని నవజాత శిశువుల ప్రత్యేక రక్షణ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటన విచార ణ నివేదికపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప సికందుల ప్రాణాలు పోవడానికి ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే కారణమని మంగళవారం ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. అసలు కారణాలను కప్పిపుచ్చి, తప్పించుకోవాలని చూడ టం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
ఎవరిని కాపాడటానికి?
నవజాత శిశువుల వార్డులో ఎలుకలు స్వే చ్ఛగా తిరుగడమే దారుణమైతే, ఆ ఎలుకలు ఏసీ వైర్లను కొరకడం వల్లే షార్ట్ సర్యూట్ జ రిగి అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు నివేదిక ఇవ్వడం హాస్యాస్పదంగా ఉన్నదని కేటీఆర్ ఆక్షేపించారు. సరార్ అసమర్థత కారణంగానే ఐదుగురు పసికందులు బలయ్యారని అందరికీ స్పష్టంగా తెలుస్తున్నా, ఇలాంటి పనికిమాలిన నివేదికలు ఇచ్చి ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారని నిలదీశారు. తప్పుడు రిపోర్టులతో ఎవరిని కాపాడటానికి ప్రభుత్వం తాపత్రయపడుతున్నదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎంకు సొంత హాస్పిటళ్లపైనే శ్రద్ధ
సీం రేవంత్‌రెడ్డికి తన సొంత ప్రైవేట్ హాస్పిటళ్లపై ఉన్న శ్రద్ధ, నిరుపేదలకు ప్రాణాధారమైన ప్రభుత్వ దవాఖానలపై లేదని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం నుంచి కనీస నిర్వహణ నిధులు విడుదల కాకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే దవాఖానలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పూర్తి న్యాయం చేయాలని, కాంగ్రెస్ చేసిన ఈ ఘోర పాపానికి బాధిత కుటుంబాల ఉసురు తగలడం ఖా యమని ఆయన హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- KTR
- rats
- RIMS Hospital
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

