KTR | కారు స్టీరింగ్ పట్టిన కేటీఆర్.. హరీశ్‌రావును ఎక్కించుకుని కారు డ్రైవింగ్
KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో స్వయంగా కారు నడుపుతూ పలువురి దృష్టిని ఆకర్షించారు. అదే కారులో ఆయన పక్కన మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా కూర్చోవడంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
KTR | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో స్వయంగా కారు నడుపుతూ పలువురి దృష్టిని ఆకర్షించారు. అదే కారులో ఆయన పక్కన మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా కూర్చోవడంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌లో బస చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం బొల్లారంలోని తన నిలయంలో రాష్ట్ర ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు.
రాష్ట్రపతి ఆహ్వానం మేరకు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణభవన్ నుంచి బొల్లారం బయలుదేరారు. కేటీఆర్ తెలంగాణభవన్ నుంచి బయలుదేరే సమయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కారులో (డిఫెండర్) వెళ్లారు. తానే డ్రైవ్ చేస్తానని కేటీఆర్ పేర్కొనడంతో అప్పటిదాకా ఉన్న డ్రైవర్ ఆయనకు స్టీరింగ్ ఇచ్చారు. డ్రైవర్ సీట్లో కేటీఆర్, ఆయన పక్కన హరీశ్‌రావు కూర్చున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు కేటీఆరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ‘కృష్ణార్జునుల స్పెషల్’ అని వైరల్ కావడం విశేషం.
కారు స్టీరింగ్ పట్టిన కేటీఆర్
శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్‌హోమ్ కార్యక్రమానికి మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావును కారులో ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు.
రాష్ట్రపతి ఆతిథ్యానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ఎట్‌హోం (తేనీటి విందు)కు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభలో బీఆర్ఎస్ పక్షనేత నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కోవ లక్ష్మి, విజేయుడు, లాస్య నందిత, మాణిక్‌రావు, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, తక్కళ్లపల్లి రవీందర్రావు, శంభీపూర్ రాజు, దండె విఠల్, నవీన్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- At Home
- BRS
- harish rao
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

