BRS | మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులునిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి, ప్రజలకు మద్దతుగా పోరాడుతున్న బీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు తెలిపారు. మీ పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలని సూచించారు.
కాగా, జిల్లాలోని చిన్నచింతకుంట మండల కేంద్రంలో 1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు ఆల వెంకటేశ్వర్ రెడ్డి దీటుగా సమాధానమి చ్చారు. అలాగే అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి నుంచి తరిమికొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో కేటీఆర్ ఫోన్ చేసి ప్రజల తరఫున ఉద్యమిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు తెలిపారు.
దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ అభినందనలు
భూత్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు
ఈ నిరసన కార్యక్రమంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి,… pic.twitter.com/sgEcrdmwVE
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2026