ఏఐ భూతం కాదు.. మానవాళికి ఊతం
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను భూతంగా చూడొద్దని, మానవాళికి ఉపయోగపడే ఊతంగా, సాధనంగా వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలోని అన్ని శాఖలు, వ్యవస్థలతో ఏఐని అనుసంధానం చేస్తామని తెలిపారు.
- అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ శాఖల్లోకి ఏఐ
- గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలకు అవకాశం
- తెలంగాణ యువత ఉద్యోగాల కోసం చూడటం
- కాకుండా.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి
- నానక్‌రామ్‌గూడలోని షెరటాన్ హోటల్లో ‘క్యాంపస్
- హబ్ ఏఐ ప్రొడక్ట్’ లాంచ్ కార్యక్రమంలో కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను భూతంగా చూడొద్దని, మానవాళికి ఉపయోగపడే ఊతంగా, సాధనంగా వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలోని అన్ని శాఖలు, వ్యవస్థలతో ఏఐని అనుసంధానం చేస్తామని తెలిపారు. నానక్‌రామ్‌గూడలోని షెరటాన్ హోటల్లో సోమవారం నిర్వహించిన క్యాంపస్ హబ్ ఏఐ ఉత్పత్తి ఆవిషరణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు కలిసి క్యాంపస్ హబ్ ఏఐని రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ నలుగురు యువకులు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఉద్యోగాలు వెతుకునేవారిగా కాకుండా, ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే వారి ఆలోచన ఆదర్శనీయమని అభినందించారు. యువత పెద్ద కలలు కనాలని, కొత్త ఆలోచనలతో ముందుకురావాలని సూచించారు. వైఫల్యాలను అనుభవాలుగా తీసుకొని, వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ లక్ష్యాలను సాధించాలని సూచించారు.
గతంలో తెలంగాణలో ఐటీ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని, ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తున్నదని చెప్పారు. ప్రపంచం ప్రస్తుతం ఏఐ యుగంలోకి అడుగుపెడుతున్నదని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మనమూ మారాలని సూచించారు. ఏఐని కేవలం సాంకేతిక అభివృద్ధిగా కాకుండా ప్రజల సమస్యలకు పరిషారం చూపే సాధనంగా ఉపయోగించాలని కోరారు. అవసరమైన చోటే ఏఐని వినియోగించాలని, దుర్వినియోగం చేయకూడదని పేరొన్నారు. కొత్త విషయాలను నేర్చుకోవడంతోపాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, రీ-సిల్లింగ్, అప్-సిల్లింగ్ అవసరమని చెప్పారు.
వ్యవసాయంలో ఏఐతో ప్రయోగాలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏఐ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. 2020ని ‘ఇయర్ ఆఫ్ ఏఐ’గా ప్రకటించి, వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై దృష్టి సారించామని తెలిపారు. సిరిసిల్ల ప్రాంతంలోని వీర్నపల్లిలో ‘ఏఐ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్’, ‘సాగు బాగు’ కార్యక్రమాల ద్వారా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువచేసే ప్రయత్నం చేశామని చెప్పారు. పంట ఆకుల ఫొటోను మొబైల్ ద్వారా పంపితే తెగుళ్లు, వాటి నివారణకు సంబంధించిన సూచనలు అందించే విధానాన్ని ఉదాహరణగా వివరించారు.
విద్యావ్యవస్థలో ఏఐ కీలక పాత్ర పోషించనున్నదని చెప్పారు. ప్రతి విద్యార్థీ నేర్చుకునే సామర్థ్యం, అవసరాలు వేర్వేరుగా ఉంటాయని, వాటికి అనుగుణంగా వ్యక్తిగత బోధన అందించేందుకు ఏఐ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలకు సాంకేతిక పరిషారాలు చూపే ఉత్పత్తుల ఆవిషరణను స్వాగతించారు. క్యాంపస్ హబ్ ఏఐతోపాటు ఇతర ఉత్పత్తులు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్‌కే ఐటీ పరిమితం కావొద్దు
ఐటీ పరిశ్రమల ఏర్పాటు హైదరాబాద్‌కే పరిమితం కాకూడదని కేటీఆర్ చెప్పారు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు విస్తరించాలని ఆకాంక్షించారు. పరకాలలో డీజీ యోధా సంస్థను స్థాపించి స్థానికంగా సుమారు 267 మందికి ఉపాధి కల్పిస్తున్న రాకేశ్‌ను అభినందించారు. బెల్లంపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో యువత ఐటీ సంస్థలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తున్న ఉదాహరణలను ప్రస్తావించారు. పట్టుదల, సరైన ప్రణాళిక ఉంటే చిన్న పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చేయవచ్చని చెప్పారు.
అన్నిప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగం
రెండేండ్ల్ల తర్వాత కచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, తాము వచ్చాక అన్ని ప్రభుత్వ శాఖలకు ఏఐని అనుసంధానం చేస్తామని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయం, వైద్యం, విద్య సహా అన్ని రంగాల్లో వినియోగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని విస్తరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఏఐ మన ఆలోచన, పని, విద్య, జీవన విధానాల్లో మార్పులు తీసుకొస్తుందని చెప్పారు. ఇప్పటికే డ్రైవర్ లెస్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్ల వరకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, రాబోయే కాలమంతా ఏఐదే కీలక పాత్ర అని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

