నేడు నదీ బోర్డుల భేటీ

- కేఆర్ఎంబీ ఎజెండాలో 13 అంశాలు
- కృష్ణా జలాల పంపిణీపై ప్రధాన చర్చ
- తెలంగాణ సూచించిన అంశాలకు చోటు
- సాయంత్రం జీఆర్ఎంబీతో సంయుక్త భేటీ
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాల వివాదం, కేంద్రప్రభుత్వం ప్రకటించిన గెజిట్ అమలుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బుధవారం సమావేశం కానున్నది. హైదరాబాద్‌లోని జలసౌధలో ఉదయం 10.30 మొదలుకానున్న సమావేశ ఎజెండాలో 13 అంశాలను చేర్చారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పలు అంశాలకు కూడా చోటు కల్పించారు. కోర్టు కేసుల కారణంగా గత సమావేశానికి రాలేకపోయిన తెలంగాణ ఈసారి హాజరుకానున్నది. కేఆర్ఎంబీ గత జూలైలోనే త్రిసభ్యకమిటీ సమావేశం నిర్వహించాలనుకున్నది. పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహిస్తేనే అన్ని అంశాలపై చర్చించగలమని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాయడంతో అది వాయిదాపడింది. ఆగస్టు 9న సమావేశం ఏర్పాటుచేసినా, కోర్టు కేసుల కారణంగా తెలంగాణ హాజరుకాలేకపోయింది. మళ్లీ ఆగస్టు 27న సమావేశం నిర్వహిస్తామని చెప్పిన కేఆర్ఎంబీ అనివార్య కారణాలతో వాయిదా వేసింది. సెప్టెంబర్ 1న సమావేశం ఉంటుందని రెండు రాష్ర్టాలకు మరోసారి లేఖలు రాసింది. సాయంత్రం 4 గంటలకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)తో కలిసి కేఆర్ఎంబీ జ్యూరిస్డిక్షన్ అమలు అంశాలపై సమావేశం కానున్నది.
కేఆర్ఎంబీ ఎజెండాలోని ప్రధాన అంశాలు
- 12వ బోర్డు మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చ
- కేఆర్ఎంబీలో ఖాళీగాఉన్న 4 పర్సనల్ సెక్రటరీ, ఒక సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టు భర్తీపై నిర్ణయం.
- కేఆర్ఎంబీ నిర్వహణకు విడుదల చేయాల్సిన బడ్జెట్‌పై చర్చ.
- 2021-22 నీటి సంవత్సరానికి సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జలాల వినియోగంపై నిర్ణయం.
- గతేడాది మిగులు జలాల క్యారీఫార్వర్డ్పై మరోసారి చర్చ.
- ప్రాజెక్టులన్నీ నిండాక సర్ప్లస్ అయ్యేనీటిని ఇరురాష్ర్టాలు ఏ ప్రాతిపదికన వినియోగించుకోవాలి.
- కేంద్రం విడుదల చేసిన గెజిట్ అమలుకు ఏర్పాటుచేయాల్సిన అధికార వ్యవస్థతోపాటు, ఇప్పటికే ప్రగతిలో ఉన్న అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆరునెలల్లోగా అనుమతులు తీసుకోవడం.
- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్తు ఉత్పత్తి, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలు.
- గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే.. కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీల కేటాయింపు
- కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విశాఖకు తరలించడం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

