20 నుంచి యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు
Krishnashtami | యాదాద్రీశుని అనుబంధ ఆలయమైన యాదగిరిగుట్ట శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.
యాదాద్రి: యాదాద్రీశుని అనుబంధ ఆలయమైన యాదగిరిగుట్ట శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజులపాటు శ్రీ కృష్ణాష్టమి కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు.
ఈనెల 22న (సోమవారం) శ్రీకృష్ణ జయంతి సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 4.30 గంటలకు ఉట్లు కోట్టే కార్యక్రమం (శిఖ్యోత్సవము) నిర్వహిస్తామన్నారు. అదేరోజు రాత్రి 7.45 గంటలకు రుక్మిణి కల్యాణోత్సవం నిర్వహిస్తాని తెలిపారు. కణ్ణన్ తిరునక్షత్రం సందర్భంగా శనివారం నాటి నిత్య కల్యాణం, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, భోగములు రద్దు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

