KP Vivekananda | 6 గ్యారంటీలను 1000 రోజులైనా అమలు చేయని అసమర్థుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
KP Vivekananda | రేవంత్ రెడ్డి ఏరకంగానైతే తన అవినీతి, అబద్దాల పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నడో.. ఇది ఎప్పుడు కూలిపోతుందో..? ఎప్పుడు ప్రజలు ప్రశ్నిస్తరో అని భయంతో ప్రజలకు కొత్త కొత్త అబద్ధాలు చెబుతూ ప్రజలను మొదటి నుంచి అయోమయానికి గురి చేస్తూనే ఉన్నడని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు.
KP Vivekananda | తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా కేసీఆర్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడటం మొదటిసారి కాదు.. పదే పదే తను సమాధానం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడటం వారికి అలవాటుగా మారిపోయింది. రేవంత్ రెడ్డి 1000 రోజుల పాలన దగా పాలన వెయ్యి నాలుకల పాలనగా మారిందని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎందుకంటే నిన్న మాట్లాడిన మాట ఈ రోజుండదు.. నేడు మాట్లాడిన మాట రేపుండదు.. ఏరకంగానైతే తన అవినీతి, అబద్దాల పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నడో.. ఇది ఎప్పుడు కూలిపోతుందో..? ఎప్పుడు ప్రజలు ప్రశ్నిస్తరో అని భయంతో ప్రజలకు కొత్త కొత్త అబద్ధాలు చెబుతూ ప్రజలను మొదటి నుంచి అయోమయానికి గురి చేస్తూనే ఉన్నడని మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలను వెయ్యి రోజులైనా అమలు చేయని అసమర్థుడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదన్నారు. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు.. మసిపూసి మారెడు కాయ చేసి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. ఈ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లబోతుందని తెలియడంతో.. వెంటనే సీఎం కార్యాలయంలో అన్ని భోగస్ మాటలు, అంకెలతో ప్రగతి సాధించామని ప్రకటనలు చేశారు. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ జరుగుతుంది కదా.. మీ 1000 రోజుల పాలనపై శ్వేత పత్రం విడుదల చేయాలని.. చర్చపెట్టేందుకు సిద్ధం కావాలని మిమ్మల్ని ప్రజల తరుపున ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని ఎవరూ నమ్మక.. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని తీసుకొచ్చి ఇచ్చిన ప్రకటనలు, డిక్లరేషన్లు అన్నీ కూడా చర్చ పెడదామన్నారు.
LIVE: BRS MLA @kp_vivekanand Press Meet at Telangana Bhavanhttps://t.co/SlN5ZvLjHg
— BRS Party (@BRSparty) September 1, 2026
Read Also :
Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కత్తులతో మహిళ దాడి.. వీడియో
Biceps | పెద్ద బైసెప్స్ కావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఇలా చేయండి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

