పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించి ఎస్ఈసీ కొవిడ్-19 సూచనలు

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించి పాటించాల్సిన కొవిడ్-19 నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి పలు సూచనలు చేశారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుండి ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ పలు సూచనలు చేశారు.
- ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి
- పోలింగ్ కేంద్రాలను శానిటైజ్ చేయాలి
- ఓటింగ్ ముందు, తర్వాత వ్యక్తి చేతులను శానిటైజ్ చేయాలి
- భౌతికదూరం పాటించేలా రింగ్స్‌ను ఏర్పాటు చేయాలి
- పోలింగ్ సిబ్బంది విధిగా మాస్కులు, ఫేస్ షీల్డులు, గ్లౌజులు ధరించాలి
- పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఆరోగ్య సిబ్బంది అవసరమైన మెడికల్ కిట్లతో సిద్ధంగా ఉండాలి
- పోలింగ్ రోజున, కౌంటింగ్ రోజున గుంపులుగా ఉండకుండా చూసుకోవాలి
- కౌంటింగ్ హాల్స్‌లో ఐదుకు మించి టేబుల్స్ ఉండకుండా చర్యలు తీసుకోవాలి
- ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు
- రిటర్నింగ్ అధికారి నుండి ఎన్నికైన ద్రువపత్రం అందుకోవడానికి అభ్యర్థితో పాటు మరొకరికి మాత్రమే అనుమతి
- పోలింగ్, కౌంటింగ్ సిబ్బంది అందరూ ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి
ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు శివ బాలాజీ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, ఓఎస్డీ జయసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

