రజకులకు ఉచిత విద్యుత్తు చరిత్రాత్మకం

- రజక సంఘాల సమితి చీఫ్ అడ్వయిజర్ కొండూరు
నల్లగొండ రూరల్, జూన్ 9 : రజకుల ఆర్థిక బలోపేతానికి నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మకమని రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్ కొండూ రు సత్యనారాయణ పేర్కొన్నారు. ఉచిత విద్యుత్తు అమలు విధివిధానాల్లో మార్పులు చేయాలని రజక సంఘాల విజ్ఞప్తి మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్ బుధవారం రాష్ట్ర స్థాయి రజక సంఘ ప్రతినిధులతో జూమ్‌లో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న కనెక్షన్‌తోనే అమలుచేయాలని, ట్రేడ్ లైసెన్స్, అద్దె అగ్రిమెంట్ తీసివేయాలని కోరారు. మూడు నెలల అడ్వాన్స్ బిల్లు చెల్లింపు ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తిచేశారు. యాంత్రిక దోభీ ఘాట్‌కు కేటగిరి 3 ఎల్టీ కనెక్షన్ ఇవ్వాలని కోరారు. రజక సంఘాల జిల్లా ప్రతినిధులు చిలకరాజు చెన్నయ్య, లకడపురం వెంకన్న, శ్రీను, వెంకన్న, శంకర్, తదిదతరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

