Komuravelli Mallanna | ఘనంగా ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న జాతర
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర (Komuravelli Mallanna) ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చి తొలి ఆదివారం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు తమ కొంగుబంగారమైన కోర మీసాల మల్లన్నను దర్శించుకుంటున్నారు.
కొమురవెల్లి: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర (Komuravelli Mallanna) ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చి తొలి ఆదివారం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు తమ కొంగుబంగారమైన కోర మీసాల మల్లన్నను దర్శించుకుంటున్నారు. రెండున్నర నెలలపాటు కొనసాగనున్న ఈ జాతర.. ఉగాదికి వచ్చే ఆదివారంతో ముగియనుంది. బ్రహ్మోత్సవాల్లో పట్నం వారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున నిర్వహించే పెద్ద పట్నం, అగ్నిగుండాలు ప్రముఖ కార్యక్రమాలు, ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయం, రాజగోపురం, గదులకు రంగులు వేయించడంతో సుందరంగా కనిపిస్తున్నాయి.

ఆలయంలో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. పట్నం వేసి కల్యాణం జరిపించి మొక్కులు తీర్చుకుంటారు. పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమై 12 ఆదివారాలు కొనసాగుతాయి. 12 ఆదివారాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. భక్తులకు విశిష్ట దర్శనం, శ్రీఘ్రదర్శనం, ధర్మ దర్శనం కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.పట్నం వారానికి ఆదివారం అధిక సంఖ్యలో హైదరాబాద్ భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. హైదరాబాద్‌కు చెందిన భక్తులు మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజుల చేపట్టి, పట్నం వారం స్వామిని దర్శించుకున్న అనంతరం, దీక్షను విరమిస్తారు. పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తారు. ఈ నెల 20న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద పెద్ద పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని హైదరాబాద్ ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఆలయ వర్గాల పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

