పాము కాటేసిందంటే జోకులేసుకున్నరు!
అర్ధగంట గడిచిపోయింది. ఒకే గదిలో కూర్చున్న ముగ్గురు డాక్టర్ల పకపకలు.. ముచ్చ ట్లు.. పాము కాటుకు గురై, తీవ్ర భయాందోళనతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే వైద్యులు వ్యవహరించిన తీరిది.
- బాధితురాలిని పట్టించుకోని డాక్టర్లు
- ఖమ్మం పెద్ద దవాఖాన వైద్యుల అలసత్వం
- ముచ్చట్లతో కాలక్షేపం
- ప్రశ్నిస్తే బాధితురాలిని తీసుకొచ్చిన వ్యక్తిపై ఆగ్రహం
- కాంగ్రెస్ పాలన గిట్లనే ఉంటదని జనాల సెటైర్లు
పౌరుడు : ‘డాక్టరమ్మా! మా అమ్మను పాము కరిచింది. కొంచెం చూడండమ్మా..!
డాక్టరు : ఓపీ రాయించుకున్నారా?
పౌరుడు : లేదమ్మా
డాక్టరు : ఓపీ రాయించుకుని రా.. పో పావుగంట తర్వాత..
పౌరుడు : ఓపీ రాయించుకుని వచ్చాను. ఒక్కసారి వచ్చి చూడండమ్మా..
డాక్టరు : టెస్ట్‌లు చేయించుకున్నారా?
పౌరుడు : ఏ టెస్ట్ చేయించాలి? ఎవరూ చెప్పలేదమ్మా
డాక్టరు : చెప్పింది చెయ్ వెళ్లు (విసుగ్గా)
ఖమ్మం సిటీ, జూలై 20 : అర్ధగంట గడిచిపోయింది. ఒకే గదిలో కూర్చున్న ముగ్గురు డాక్టర్ల పకపకలు.. ముచ్చ ట్లు.. పాము కాటుకు గురై, తీవ్ర భయాందోళనతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే వైద్యులు వ్యవహరించిన తీరిది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గండికోట వెంకటమ్మ శుక్రవారం ఉదయాన్నే ఓ రైతుకు చెందిన కూరగాయల చేను లో పనికి వెళ్లగా పాము కాటేసింది. రైతు ఆయ న ఆటోలో హుటాహుటిన ఖమ్మంలోని జిల్లా సార్వజనీన దవాఖానకు తీసుకెళ్లాడు. ఆమెను స్ట్రెచర్‌లో కూర్చోబెట్టుకుని క్యాజువాలిటీ వార్డు కు వెళ్లాడు.
ఎదురుగా ఉన్న గదిలో ముగ్గురు వైద్యురాళ్లు కూర్చుని ఏవో మాటల్లో మునిగిపోయారు. వారి దగ్గరకు వెళ్లిన రైతు.. తమ గ్రామానికి చెందిన మహిళ పాము కాటుకు గురైందని, వచ్చి చూడాలని ప్రాధేయపడ్డాడు. ‘ఏం పాము కరిచింది? ఓపీ రాయించుకుని వచ్చారా? అంటూ.. డాక్టర్లు కనీసం కుర్చీలో నుంచి లేవకుండా, బాధితురాలిని చూడకుం డా.. పేషెంట్‌ను తీసుకెళ్లిన వ్యక్తిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓపీ వార్డుకు వెళ్లగా జనం బారు లు తీరి పావుగంట సమయం గడిచింది. తిరిగి క్యాజువాలిటీ వద్దకు వచ్చిన వారిని టెస్ట్‌లు చే యించుకుని రావాలంటూ మరో ఆర్డర్ వేశారు. ప్రాణభయంతో కొట్టుకుంటున్న మహిళను తీసుకుని రక్తపరీక్షల కేంద్రానికి వెళ్లి వచ్చేసరికి మరో అర్ధగంట పట్టింది. ఇప్పుడన్నా వచ్చి చూడండి మేడం అని వైద్యులను కోరగా ఎలాంటి స్పంద నా లేదు. చేతుల్లోని సెల్ఫోన్లను చూస్తూ ముగ్గు రూ ముచ్చట్లోకి దిగారు. ఒకరిమీద మరొకరు జోకులు వేసుకుంటూ పగలబడి నవ్వుకున్నారు.
ప్రశ్నించిన వ్యక్తిపై ఆగ్రహం
వైద్యుల అలసత్వంపై రైతు తీవ్ర అసహ నం వ్యక్తంచేశాడు. ఇదేంటి మేడం.. మనిషి చనిపోతున్నా స్పందించరా? అని ప్రశ్నించా డు. దీంతో ఆగ్రహించిన వైద్యులు.. అరుస్తున్నావ్ ఎందుకు? మాకు తెలియదా? ఆమెకు ఏమీ కాదులే..! అంటూ ఒక మహిళా డాక్టర్ తీరిగ్గా కుర్చీలో నుంచి లేచి పేషెంట్ దగ్గరకు వచ్చారు. నాడీ కూడా పట్టకుండానే ఇంజెక్షన్ ఇవ్వండి అంటూ పక్కనే ఉన్న నర్సుకు చెప్పి తిరిగి గదిలోకి వెళ్లిపోయింది. వైద్యుల అలసత్వంతో విసిగిపోయిన ఓ వ్యక్తి అక్కడ జరుగుతున్న తీరును ఎవరికీ తెలియకుండా వీడియో తీసి శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరలైంది. కాంగ్రెస్ పాలనలో గిట్లనే ఉంటదని మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నం
జిల్లా సార్వజనీన దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం ఓపీ విపరీతంగా పెరిగింది. అయినప్పటికీ ఎంతో జాగ్రత్తగా వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం సరికాదు.
– కిరణ్‌కుమార్,దవాఖాన సూపరింటెండెంట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

