Nallagonda | నల్లగొండ జిల్లాలో 103 కిలోల గంజాయి స్వాధీనం.. ఆరుగురు అరెస్ట్
Nallagonda | నల్లగొండ : నల్లగొండ జిల్లా పరిధిలోని కేతెపల్లిలో 103 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Nallagonda | నల్లగొండ : నల్లగొండ జిల్లా పరిధిలోని కేతెపల్లిలో 103 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 10 లక్షల విలువ చేస్తుందని పోలీసులు నిర్ధారించారు.
అరెస్టు అయిన వారిలో ఒడిశాకు చెందిన అశోక్ తారఫర్, అభిజిత్ తారఫర్, ఫణి తారఫర్, శిఖా బిస్వాల్, ధనుంజయ్ బిస్వాల్, మధ్యప్రదేశ్‌కు చెందిన జీవన్ సింగ్ యాదవ్ ఉన్నారు. వినయ్, వివేక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా నల్లగొండ ఎస్పీ అపూర్వ రావు మాట్లాడుతూ.. టాస్క్ ఫోర్స్, కేతెపల్లి పోలీసులు సంయుక్తంగా కలిసి కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారని తెలిపారు. ఓ బస్సును తనిఖీ చేస్తుండగా ఎనిమిది మంది వ్యక్తులు బస్సు దిగి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, వారిలో ఆరుగురిని పట్టుకున్నారు. ఆరుగురు నిందితుల నుంచి 103 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

