CM KCR | నేడు కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ.. కేంద్రంపై పోరుకు మద్దతు కోరనున్న ఢిల్లీ సీఎం
CM KCR | బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
CM KCR |హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయన సమావేశం కానున్నారు. జాతీయ రాజకీయాలు, భారత సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కోరుతున్న విషయం తెలిసిందే. ఇరువురు సీఎంల భేటీ సందర్భంగా ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలున్నాయి. దేశ రాజధాని పరిధి ఢిల్లీలో గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలు తదితర కీలక విషయాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకున్నది.
ఇందుకోసం ఈనెల 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను కేంద్రం జారీ చేసింది. సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవటానికి జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి చైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో పేరొన్నారు. అయితే ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అమలు పరచాల్సిందేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు మంత్రులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని కేజ్రీవాల్ ఆరోపిస్తూ కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ఇప్పటికే పలువురు నేతలను కలిశారు. ఈ క్రమంలోనే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కాబోతున్నారు. కేజ్రీవాల్ వెంట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి ఈ భేటీలో పాల్గొనబోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Aravind Kejriwal
- BJP
- BRS
- CM KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

