దేశానికే వన్నె తేవాలి

- మన ఆత్మగౌరవం ఇనుమడించేలా కొత్త సచివాలయ నిర్మాణం
- పది కాలాలపాటు పటిష్టంగా నిలవాలి
- ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండాలి
- ‘ధోల్పూర్ స్టోన్’తో తీర్చిదిద్దిన ఫౌంటెన్లు
- అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నె తెచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. నూతన సచివాలయం అలంకృత రూపంతో అద్భుతంగా ఉండాలని చెప్పారు. పది కాలాలపాటు నిలిచి ఉండే సచివాలయాన్ని పటిష్టమైన రీతిలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం పనులను సీఎం కేసీఆర్ గురువారం పరిశీలించారు. సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతంలో కాలినడకన కలియతిరిగి, నిర్మాణంలో ఉన్న పిల్లర్లను, బీమ్ల నాణ్యతను, పనితీరును పరిశీలించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు సహా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు నిర్మాణాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణం, సుందరీకరణ కోసం వినియోగించేందుకు రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్సాండ్ స్టోన్, బీజ్సాండ్ స్టోన్, నేచురల్ బీజ్, నేచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రగతిభవన్‌లో సెక్రటేరియట్ నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అభివృద్ధి సంక్షేమ రంగాల్లో దేశానికే మార్గదర్శిగా పాలన సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. దేశం గర్వించేలా పలు రాష్ర్టాలకు ఆదర్శంగా మన సచివాలయం నిలువాలి. ఉద్యోగులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే వాతావరణాన్ని నెలకొల్పాలి. విశాలమైన అంతర్గత రోడ్లు, పలురకాల పూల మొక్కలతో విశాలమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేసుకోవాలి. పార్లమెంటు, రాష్ట్రపతి భవన్‌కు సమీపంలో ఉన్న తరహాలో ‘ధోల్ పూర్ స్టోన్’తో తీర్చిదిద్దిన ఫౌంటెన్లను నిర్మించుకోవాలి. అన్ని హంగులతో తెలంగాణ సచివాలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ, సచివాలయ వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

