హైదరాబాద్, ఏప్రిల్ 20(స్పెషల్ టాస్క్బ్యూరో, నమస్తే తెలంగాణ): జగిత్యాలలో బీఆర్ఎస్ సభ సక్సెస్ అయ్యింది. ఊహించినదాని కంటే ఎక్కువ మంది ప్రజలు స్వచ్ఛందంగా హాజరై కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని చెప్పకనే చెప్పారు. గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా బీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందంటూ వార్తలు వచ్చా యి. బీఆర్ఎస్ సభపై ప్రముఖ ఏఐ చాట్బాట్లు కూడా తమదైన శైలిలో విశ్లేషించాయి.
బీఆర్ఎస్ సభ, కేసీఆర్ ప్రసంగం, సభకు వచ్చిన స్పందన తదితర విషయాలపై ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్, గ్రోక్, చాట్‌జీపీటీలను ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయా ఏఐ చాట్బాట్లు బీఆర్ఎస్ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని బదులిచ్చాయి. ఈ సందర్భంగా కేసీఆర్ సభపై ఏయే చాట్‌బాట్ ఏం చెప్పిందో ఓసారి పరిశీలిద్దాం.
క్లాడ్: అవును. సభ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీకి దీన్ని కమ్‌బ్యాక్‌గా చెప్పొచ్చు.
గ్రోక్: సభకు హాజరైన జనం, అక్కడి భావోద్వేగ వాతావరణం, కేసీఆర్ స్పీచ్‌కు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూస్తే, ఈ సభ భారీ విజయం సాధించిందని చెప్పొచ్చు.
చాట్ జీపీటీ: సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పార్టీకి మోరల్ బూస్ట్‌ను ఇచ్చింది. రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమేంటో తెలియజేసింది.
క్లాడ్: సమైక్యపాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న అవస్థలతో మొదలై.. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని కేసీఆర్ స్పీచ్‌లో వెల్లడించారు. ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మొత్తంగా కేసీఆర్ స్పీచ్ ఒక కమ్‌బ్యాక్ సందేశంలా అనిపించింది.
గ్రోక్: కేసీఆర్ ప్రసంగం భావోద్వేగంతో పాటు ఎటాకింగ్ ైస్టెల్లో సాగింది. కాంగ్రెస్ మీద పదునైన విమర్శలు గుప్పించారు.
చాట్‌జీపీటీ: ఎమోషన్, ఎటాక్, ఫ్యూచర్.. ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని కేసీఆర్ ప్రసంగాన్ని కొనసాగించారు. పార్టీ శ్రేణులను రీచార్జ్ చేస్తూ, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు.
క్లాడ్: కేసీఆర్ ప్రసంగం పూర్తయ్యాక.. అక్కడ ఉన్నవారందరూ ‘కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి’ అని నినదించారు.
గ్రోక్: కేసీఆర్ స్టేజీ మీద కనిపించగానే ఆ ప్రాంగణమంతా ‘కేసీఆర్.. కేసీఆర్.. సీఎం.. సీఎం’ అంటూ అరుపులతో దద్దరిల్లింది.
చాట్‌జీపీటీ: కేసీఆర్ ప్రసంగానికి వచ్చిన ప్రజా స్పందనను చూస్తే తెలంగాణపై ఆయన ముద్ర ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.