KCR : అఖిలభారత రైతు సంఘం నేత, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి (Sarampally Mallareddy) మరణంపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) సంతాపం ప్రకటించారు. సారంపల్లి.. రైతాంగ సమస్యలపై, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, తన జీవితకాలం పోరాటం చేసిన నిబద్ధత కలిగిన రైతు ఉద్యమ నాయకుడని కేసీఆర్ కొనియాడారు.
సారంపల్లి మరణం భారత రైతాంగ ఉద్యమానికి తీరని లోటని కేసీఆర్ అన్నారు. మల్లారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.