Karimnagar | కరీంనగర్ శోభాయాత్రలో ఉద్రిక్తత.. ఆరుగురు హనుమాన్ భక్తులపై కేసు నమోదు
Karimnagar | కరీంనగర్లో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన గొడవను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు భక్తులపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Karimnagar | కరీంనగర్లో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన గొడవను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. హనుమాన్ భక్తులపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఆరుగురు భక్తులపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
కరీంనగర్ పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తం https://t.co/zSpco9Wmv6 pic.twitter.com/LKqUgIRPf9
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2024
అసలేం జరిగిందంటే..
కరీంనగర్లో హనుమాన్ దీక్ష స్వాములు శనివారం రాత్రి శోభాయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రశాంత్‌నగర్ హనుమాన్ టెంపుల్ వద్దకు రాగానే మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు అందులోకి దూరాడు. కత్తితో డ్యాన్స్ చేస్తూ వీరంగం సృష్టించాడు. దీంతో ఆగ్రహించిన హనుమాన్ భక్తులు సదరు యువకుడి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడికి, హనుమాన్ భక్తులకు మధ్య మొదలైన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది.
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీస్ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, హనుమాన్ భక్తులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ హనుమాన్ భక్తులు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా.. పోలీసులు వాహనాన్ని అలాగే స్పీడ్‌గా తీసుకెళ్లారు. ఓ హనుమాన్ భక్తుడు వాహనాన్ని పట్టుకుని అలాగే వేలాడుతూ ఉండిపోయాడు. వాహనం కొద్ది దూరం వెళ్లాక ఆపారు. ఆ తర్వాత వాహనాన్ని అడ్డుకున్న భక్తులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన కొందరు భక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల తీరుపై హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. వారికి బీజేపీ నేతలు మద్దతుగా వెళ్లారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి వరకు పరిస్థితి ఇలాగే కొనసాగింది. కాగా, హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తిని జయదేవ్‌గా గుర్తించారు. అతను బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణకు అనుచరుడు, బీజేపీ కార్యకర్త అని తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

