అది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమే : కామారెడ్డి కలెక్టర్
Kamareddy Master Plan | కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై ఆ జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాం అని స్పష్టం చేశారు. ఇటీవల
కామారెడ్డి : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై ఆ జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాం అని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పలు విషయాలను ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ఇచ్చింది ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమే అని స్పష్టం చేశారు. ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతాయన్నారు. రైతుల అభ్యర్థనలను నమోదు చేసుకుంటామని తెలిపారు. రైతుల అభ్యర్థనలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎవరైనా సరే సూచనలు ఇవ్వొచ్చని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. 60 రోజుల్లో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయి. రైతులకు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. జనవరి 11న సాయంత్రం 5 గంటల వరకు అభిప్రాయాలు చెప్పొచ్చు అని కామారెడ్డి కలెక్టర్ తెలిపారు.
భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే..
భూములు పోతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కలెక్టర్. భూములు పోతాయని ఎందుకు అపోహ పడుతున్నారో తెలియడం లేదన్నారు. భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే అని స్పష్టం చేశారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. పట్టణం ఎలా విస్తరిస్తుందో.. దాని ప్రకారమే మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ముసాయిదా ఫైనల్ కావాడానికి చాలా దశలు ఉన్నాయి. ఇది ఇంకా మొదటి దశలోనే ఉంది. రైతుల భూములు ఎక్కడికి పోవు. మీ భూమి మీ పేరు మీదనే ఉంటుందన్నారు. మా దృష్టికి వస్తున్న అభ్యర్థనలను పరిశీలించి, నివృత్తి చేస్తున్నామని తెలిపారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూముల సేకరణ కాదు అని కలెక్టర్ జితేశ్ పాటిల్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

