తామంతా సీఎం కేసీఆర్ వెంటే.. ప్రకటించిన కమలాపూర్ మండల సర్పంచులు
కమలాపూర్| టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని, కేసీఆరే మత నాయకుడని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండల సర్పంచులు

వరంగల్ అర్బన్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని, కేసీఆరే మత నాయకుడని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండల సర్పంచులు స్పష్టంచేశారు. మండలంలోని 19 గ్రామాల సర్పంచులతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకండలోని తన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టంచేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా సాగాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా అది టీఆర్ఎస్తోనే సాధ్యమని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ గారి హయాంలోనే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న తమకు అధినేత కేసీఆర్ మాటే శిరోధార్యమని స్పష్టంచేశారు. ఎల్లప్పుడూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. మండలంలోని 22 గ్రామాల టీఆర్ఎస్ సర్పంచులకు గాను 19 మంది ఉన్నామన్నారు. మిగిలిన ముగ్గురు సర్పంచులు కరోనా సోకడం వల్ల రాలేకపోయారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

