పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి : జూపల్లి
పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైటెక్స్‌లో నిర్వహించిన 24వ ట్రావెల్ టూరిజం ఫెయిర్-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైటెక్స్‌లో నిర్వహించిన 24వ ట్రావెల్ టూరిజం ఫెయిర్-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ట్రావెల్ ఇండస్ట్రీ కొత్త ప్యాకేజీలను ప్రకటించి పర్యాటకులు రాష్ర్టానికి వచ్చేలా చూడాలని కోరారు.
ట్రావెల్ టూరిజం ఫెయిర్‌తో రాష్ట్ర టూరిజం ప్రమోషన్‌కు గొప్ప అవకాశం లభించిందని చెప్పారు.
గుడ్డు పోషకాలపై అవగాహన పెంచాలి : వాకిటి శ్రీహరి
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): గుడ్డులోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరమున్నదని పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిషన్ (నెక్), పౌల్ట్రీ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ప్రపంచ గుడ్డు దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని, అందులో గుడ్డు ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటు ధరలో లభించే పోషకాహారం గుడ్డు అని తెలిపారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ.. గుడ్డులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయని, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒకరూ రోజూ గుడ్డు తినే అలవాటు చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

