TSPSC | హైదరాబాద్: రాష్ట్రంలోని 1,392 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
ఈ నెల 29న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, హిస్టరీ, సంస్కృతం.. అక్టోబర్ 3న జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఉర్దూ పరీక్షలు జరుగుతాయని, ఒక అభ్యర్థి రెండు పరీక్షలకు దరఖాస్తు చేస్తే వేర్వేరుగా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ.. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.