హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలి లభించేది ఎక్కడో తెలుసా?
Jubleehills | జనాలు స్వచ్ఛమైన గాలిని పీల్చడం గగనమవుతోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగతో హైదరాబాద్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనే స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. మరి ఆ

హైదరాబాద్ : జనాలు స్వచ్ఛమైన గాలిని పీల్చడం గగనమవుతోంది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగతో హైదరాబాద్ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనే స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. మరి ఆ ప్రాంతం ఏది అంటే.. జూబ్లీహిల్స్, మరొకటి ఉప్పల్ అని తేలింది.
కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ( TSPCB ) విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ( AQI ) రిపోర్టులో ఈ విషయం వెల్లడి అయింది. సిటీలోనే నాణ్యమైన గాలి లభించేది జూబ్లీహిల్స్ అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఉప్పల్ ఇండస్ర్టియల్ ఏరియా అయినప్పటికీ అక్కడ కూడా గుడ్ ఎయిర్ క్వాలిటీ ఉందని తెలిపారు.
సెప్టెంబర్ 7వ తేదీన జూబ్లీహిల్స్, ఉప్పల్‌లో 30 నుంచి 50 మధ్య గాలి నాణ్యత నమోదైంది. సెప్టెంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్‌లో గాలి నాణ్యత గుడ్ లెవల్లో ఉంది. ఇదే సమయంలో ఉప్పల్‌లో గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉంది. ఈ రెండు ఏరియాలతో పాటు బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్ ప్రాంతాల్లో గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉంది. జీడిమెట్లలో గాలి నాణ్యతలో ఎలాంటి మార్పు లేదు.
గాలి నాణ్యత 0-50 మధ్య ఉంటే దాన్ని గుడ్ అని పరిగణిస్తారు. 51-100 మధ్య ఉంటే సంతృప్తికరమని.. 101-200 మధ్య ఉంటే ఓ మాదిరి అని.. 201-300 మధ్య ఉంటే పూర్ అని.. 301-400 మధ్య ఉంటే వెరీ పూర్.. 400 లోపు ఉంటే తీవ్రమని పేర్కొంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

