P.Vishnuvardhan Reddy | హాఫ్ టికెట్‌గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారు.. కాంగ్రెస్ పార్టీపై పీజేఆర్ కుమారుడు విష్ణు హాట్ కామెంట్స్
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (P.Vishnuvardhan Reddy) కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. హాఫ్ టికెట్‌గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (P.Vishnuvardhan Reddy) కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. హాఫ్ టికెట్‌గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. ప్రజలకు దండాలు పెట్టేవారికి కాకుండా నాయకులకు దండాలు పెట్టేవారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ (Congress) పార్టీ గెలిచే అవకాశం ఉన్న ఏకైక స్థానం జూబ్లీహిల్స్ (Jubilee Hills) అని.. అలాంటి సీటును నియోజకవర్గంతో సంబంధంలేనివారిక ఇచ్చారణి ఫైరయ్యారు. తనకే టికెట్ ఇస్తానని మాణిక్‌రావ్ థాక్రే కూడా చెప్పారని, తీరా జాబితాలో తన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
తాను చాలా రోజులుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నానని వెల్లడించారు. ఎస్సీ, బీసీ, సెటిలర్స్ ఓట్లు అత్యధికంగా ఉన్న జూబ్లీహిల్స్‌లో కేవలం ఒక కమ్యూనిటీ కోసం టికెట్ ఇవ్వడం దారణమన్నారు. ఒకే ఇంట్లో రెండు టికెట్స్ ఇవ్వమనే వాదన నిజమైతే.. దానికి విరుద్ధంగా ఎంతో మందికి ఇచ్చారని విమర్శించారు. హైదరాబాద్‌లో పీజేఆర్ లాంటి నాయకుడి కుటుంబానికి టికెట్ ఇస్తే తప్పేందని ప్రశ్నించారు. తాను కచ్చితంగా జూబ్లీహిల్స్ నుంచి పోటీచేస్తానని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

