IT Layoffs | ఐటీలో జాబ్స్ కోత.. లేఆఫ్‌ల మోత.. జనవరిలోనే 30 వేల మందిపై వేటు
ఇంజినీరింగ్ పూర్తి చేసి కొలువుల్లో స్థిరపడాలనుకొనేవారికి ఐటీ కంపెనీలు బ్యాడ్‌న్యూస్ చెప్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఎకనమిక్ టైమ్స్' నివేదిక ప్రకారం ఈసారి నియామకాలు 20 ఏండ్ల కనిష్ఠానికి పడిపోనున్నాయి.
- వై దిస్ కొలువుల వర్రీ..!
- 20 ఏండ్ల కనిష్ఠానికి నియామకాలు
- ఫ్రెషర్లకు ప్రెజరే.. ప్లేస్మెంట్లకు కరువే
- ఉద్యోగాలపై కొవిడ్, ఉక్రెయిన్ కాటు
ఉద్యోగాల్లో ఉన్నవారికి టెన్షన్.. జాబ్ ఉంటుందో, ఊడుతుందోనని! కొత్తగా వచ్చేవారికి ప్రెజర్.. ఉద్యోగం వస్తుందో, రాదోనని! కంపెనీలన్నీ ఖర్చులో కోత.. అందుకే జాబ్స్‌లో కోత.. సగటు ఉద్యోగార్థుడికి గుండె కోత. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట. ‘ఐటీ’వాళ్లదైతే చెప్పలేని వ్యథ. ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని అంటున్నారు నిపుణులు. ఈ విద్యాసంవత్సరం ముగిసే నాటికి నియామకాలు 20 ఏండ్ల కనిష్ఠానికి చేరుకుంటాయని పేర్కొంటున్నారు.
IT Layoffs | హైదరాబాద్, ఫిబ్రవరి 3: ఇంజినీరింగ్ పూర్తి చేసి కొలువుల్లో స్థిరపడాలనుకొనేవారికి ఐటీ కంపెనీలు బ్యాడ్‌న్యూస్ చెప్తున్నాయి. ఫ్రెషర్ల రిక్రూట్మెంట్లలో భారీ కోత ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది ఎకనమిక్ టైమ్స్’ నివేదిక ప్రకారం ఈసారి నియామకాలు 20 ఏండ్ల కనిష్ఠానికి పడిపోనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల నుంచి ఐటీ కంపెనీలు కేవలం 70,000-80,000 మందిని మాత్రమే నియమించుకొనే అవకాశాలున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఈ ఏడాది 15 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టా అందుకోనుండగా, ఇందులో 10 శాతం కంటే తక్కువ మందే క్యాంపస్ ప్లేస్మెంట్లు దక్కించుకొనే అవకాశం ఉన్నది. ఈ ప్రభావం టైర్-2 కాలేజీలపై భారీగా పడనున్నది. ముఖ్యంగా ప్లేస్మెంట్లపైనే ఆధారపడి నడిచే అనేక కాలేజీలు తీవ్రంగా నష్టపోనున్నాయి.
నియామకాలు తగ్గిపోవటానికి కారణాలివే..
- ఐటీ ఉద్యోగాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. దాంతోపాటు పలు దేశాల్లోని ఉద్రిక్త వాతావరణం కూడా ప్రభావం చూపుతున్నది. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా యుద్ధాల ఎఫెక్ట్ ఉద్యోగాలపై పడింది.
- ఫ్రెషర్లను ఉపయోగించుకొనేందుకు దేశీయ కంపెనీలు వెనకంజ వేస్తున్నాయి
- వరుసగా రెండో ఏడాది కూడా ఇన్ఫోసిస్, విప్రో క్యాంపస్ ప్లేస్మెంట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. టీసీఎస్ కూడా తక్కువ మందినే నియమించుకుంటామని ప్రకటించింది.
జనవరిలో 30 వేల మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫేస్బుక్, అమెజాన్ మొదలుకొని చిన్నాచితక కంపెనీల దాకా అన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాదిలాగే ఈసారి కూడా ఈ తంతు కొనసాగుతున్నది. లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెబ్సైట్ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలోనే అన్ని కంపెనీలు కలిపి 30 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ నెల 3వ వరకు 122 సాఫ్ట్వేర్ కంపెనీలు 31,751 మందిని ఇండ్లకు పంపాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- covid
- Hyderabad
- it jobs
- IT Layoffs
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

