కోర్ కోర్సులు కొనసాగించాల్సిందే

- పూర్తిగా రద్దు చేయరాదని జేఎన్టీయూ నిర్ణయం
- ఒక్కో కాలేజీలో 60 సీట్లతో కోర్సుల నిర్వహణ
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్‌లో కోర్ కోర్సులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించేందుకు జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) చర్యలు చేపట్టింది. ఇంజినీరింగ్ కాలేజీలన్నింటిలో కోర్ కోర్సులను కొనసాగించేలా నిబంధనలు అమలుచేస్తున్నది. కోర్ కోర్సులను పూర్తిగా రద్దుచేయరాదని నిర్ణయించింది. బీటెక్‌లో సీఎస్ఈ, ఐటీ, డాటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్‌లెర్నింగ్ తదితర కోర్సుల రాకతో కోర్కోర్సులకు కష్టకాలం వచ్చిపడింది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నది. కాలేజీలన్నీ కోర్ కోర్సులను మూసివేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ ఏడాది కోర్ కోర్సులకు సంబంధించి 2010 సీట్లు రద్దయి.. సీఎస్ఈ సీట్లు పెరిగాయి. దీంతో ఉత్పాదక రంగంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులకు బీటెక్ రెండోసంవత్సరంలో ప్రవేశాలు కల్పించడం గగనమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ అధికారులు పటిష్టమైన నిబంధనలను రూపొందించారు.
జేఎన్టీయూ నిబంధనలు
- ప్రతి ఇంజినీరింగ్ కాలేజీలో కోర్ కోర్సులు ఉండాల్సిందే. ఒక్కో కోర్సును 60 సీట్లతో నిర్వహించాల్సిందే.
- 60 కంటే ఎక్కువ ఉన్న సీట్లను మాత్రమే రద్దుచేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో సీట్లు 60 కంటే తగ్గరాదు.
- వరుసగా రెండేండ్లలో ఒక కోర్సులో 30 శాతం కన్నా తక్కువ సీట్లు భర్తీ అయితేనే ఆయా కోర్సులో సీట్లను రద్దుచేసుకొనేందుకు జేఎన్టీయూ అధికారులు
- ఎన్వోసీ జారీచేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

