జనవరిలో జేఈఈ మెయిన్-1.. దరఖాస్తులు షురూ
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్ - 2023) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది
- 24 – 31 వరకు 7 రోజులు నిర్వహణ
- రెండో విడత ఏప్రిల్ మొదటి వారంలో
- మొదటి విడతకు దరఖాస్తులు షురూ
- షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్ – 2023) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్షలు వచ్చే ఏప్రిల్ 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో ఉంటాయని ఎన్టీయే వెల్లడించింది. పరీక్ష ఎప్పటిలాగే ఆన్లైన్ విధానంలో (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్)ఉంటుందని తెలిపింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.
దరఖాస్తుల స్వీకరణ
జేఈఈ మెయిన్ మొదటి విడత దరఖాస్తు లు గురువారం రాత్రి నుంచి ప్రారంభమయ్యా యి. జనవరి 12వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌లో జరిగే రెండో విడత పరీక్షలకు సంబంధించిన దరఖాస్తులను ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు స్వీకరిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాలకు ఎన్టీఏ వెబ్సైట్ చూడాలని, లేదా 011 40759000/ 011 69227700 నం బర్లకు ఫోన్ చేయవచ్చని ఎన్టీయే తెలిపింది. 2019 వరకూ జేఈఈ మెయిన్స్ జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించారు. కొవిడ్ కారణం గా గత రెండేండ్లుగా నాలుగు విడతలుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. తర్వాతి ఏడాది పరీక్షకు కేవలం 2 నెలల్లోనే నోటిఫికేషన్ ఇవ్వడం విశే షం. 2022 జేఈఈ మెయిన్‌కు 10.26 లక్షల మంది దరఖాస్తు చేయగా..9,05,590 మంది హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్ నిర్వహిస్తారు. వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

