JEE Main | రేపటి నుంచి జేఈఈ మెయిన్ -2 పరీక్షలు
జేఈఈ మెయిన్ -2 పరీక్షలు ఈ నెల 4 నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
- 12 వరకు మెయిన్ -2 పరీక్షలు
- రెండు గంటల ముందుగానే విద్యార్థులకు ఎంట్రీ
- పరీక్షాకేంద్రాల నుంచి 5 పట్టణాల తొలగింపు
JEE Main | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -2 పరీక్షలు ఈ నెల 4 నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
మన తెలుగు రాష్ర్టాల నుంచి 50వేల మంది ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షా సమయానికి రెండు గంటల ముందుగానే అభ్యర్థులను పరీక్షాకేంద్రాల్లోకి పంపిస్తారు. ఇంగ్లిష్తోపాటు తెలుగు, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తారు. బీఈ, బీటెక్ పరీక్షను జనరల్ విద్యార్థులకు 3 గంటలు నిర్వహించనుండగా, దివ్యాంగ అభ్యర్థులకు 4 గంటల పాటు జరుగుతుంది.
బీఆర్క్, బీప్లానింగ్ పరీక్షను సాధారణ విద్యార్థులకు మూడున్నర గంటల పాటు నిర్వహించనుండగా, దివ్యాంగ అభ్యర్థులకు నాలుగు గంటల 10 నిమిషాల పాటు కొనసాగనున్నది. ఇప్పటికే ఈ నెల 4, 5, 6న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. మిగతా వారి అడ్మిట్కార్డులను త్వరలోనే విడుదల చేయనున్నది.
5 పట్టణాలు ఔట్
జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి రాష్ట్రంలోని ఐదు పట్టణాలను తొలగించారు. నిరుడు రాష్ట్రంలో 16 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించగా, ఈ సారి 11 పట్టణాలకే పరిమితం చేశారు. ఈసారి కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, సికింద్రాబాద్లలోని పరీక్షాకేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తారు. ఈసారి జనగామ, మేడ్చల్, సంగారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల పట్టణాలను పరీక్షాకేంద్రాల జాబితా నుంచి తొలగించారు.
పరీక్షాతేదీలు
పేపర్ -1 (బీఈ, బీటెక్)
ఏప్రిల్ 4, 5, 6, 8, 9
పేపర్ -2 (ఏ), 2(బీ)
ఏప్రిల్ 12
పరీక్షాసమయం
మొదటి షిఫ్ట్ : ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు
రెండోషిఫ్ట్ : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు
(నోట్ – బీఆర్క్, బీప్లానింగ్ వారికి అదనంగా సమయం కేటాయిస్తారు )
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

