Janareddy | కాంగ్రెస్ అధిష్ఠానంపై జానారెడ్డి అలక.. అదే జరిగితే కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ !
Janareddy | తన కుమారులు ఇద్దరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్న హామీ దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అలిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఇద్దరు కుమారులు నాగార్జునసాగర్, మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Janareddy | హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): తన కుమారులు ఇద్దరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్న హామీ దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అలిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఇద్దరు కుమారులు నాగార్జునసాగర్, మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాగార్జునసాగర్ టికెట్ మాత్రమే ఇస్తామని అధిష్ఠానం ఆయనకు సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయన అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఇటీవల పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, అతని కుమారుడు రోహిత్‌కు రెండు టికెట్లపై హామీ లభించింది. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతికి, కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి రెండు టికెట్లపై హామీ లభించినట్టు తెలిసింది. కానీ, తన కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వజూపడంతో జానారెడ్డి పార్టీ కార్యక్రమాల్లోనూ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాలుగా పని చేస్తున్న తమకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించినట్టు సమాచారం. ఒకవేళ అధిష్ఠానం ఒకే టికెట్‌కే కట్టుబడి ఉంటే జానారెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

