ఆరు పంటల్లో నాలుగు ఎండబెట్టిన కాంగ్రెస్
అధికారంలోకి వచ్చిన 33 నెలల్లో ఆరు పంటల సీజన్లు పూర్తయితే నాలుగింటిని ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ సర్కార్‌కు దక్కిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్‌పహాడ్ మండలం నూర్జహాన్‌పేట, గూడెపుకుంటతండా గ్రామాల్లో సోమవారం ఆయన ఎండిన వరి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు.
- ఎటుచూసినా ఎండిన పంటలే..
- రేవంత్ తన బాకా మీడియాను గ్రామాలకు పంపాలి
- ఇంకా జాప్యం చేస్తే ఎండిన పొలాలే తిరుగబడుతాయి
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హెచ్చరిక
సూర్యాపేట, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన 33 నెలల్లో ఆరు పంటల సీజన్లు పూర్తయితే నాలుగింటిని ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ సర్కార్‌కు దక్కిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్‌పహాడ్ మండలం నూర్జహాన్‌పేట, గూడెపుకుంటతండా గ్రామాల్లో సోమవారం ఆయన ఎండిన వరి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు తమ కష్టాల గోడును జగదీశ్‌రెడ్డి వద్ద వెళ్లబోసుకున్నారు.
ఆతరువాత చీదెళ్ల సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ను పరిశీలించిన అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఎటు చూసినా వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దమ్ముంటే రేవంత్ తనకు బాకా ఉదే మీడియాను గ్రామాల్లోకి పంపితే వాస్తవాలు తెలుస్తాయని సవాల్ చేశారు. నీళ్లు, కరెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కాలయాపన చేస్తే ఎండిన వరి పొలాలే తిరుగుబాటు చేస్తాయని, రైతులు బెత్తాలు పట్టుకొని ఉరికిస్తారని హెచ్చరించారు.
మన నీళ్లు ఏపీకి ధారాదత్తం
రాష్ట్రంలో ఉన్న యాదాద్రి పవర్‌ప్లాంట్, కొత్తగూడెం, భద్రాద్రి ప్లాంట్లను ఎందుకు బంద్ చేసి విద్యుత్తు ఇవ్వడం లేదని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఇక నీళ్లను ఏపీకి ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడేండ్లలో దోచుకోవడం, పైరవీలు, భూదందాలు చేయడం తప్ప రాష్ర్టానికి చేసింది శూన్యమని మండిపడ్డారు. నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విద్యుత్తు మంత్రి భట్టి విక్రమార్కతోపాటు నల్లగొండ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్తే ఏ ఊరికైనా వస్తామని దమ్ముంటే పోలీసులు లేకుండా రావాలని, తాను ఒంటరిగా వస్తానని అన్నారు. అప్పుడు ప్రజలు ఎవరిని తరిమి కొడతారో చూద్దామని వ్యాఖ్యానించారు.
సర్వేలకొస్తున్న కాంగ్రెస్ నేతల ఆస్తుల్లో మాకు సగం కూడా లేవు
తమ కష్టార్జితాన్ని ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లో చూపిస్తూ.. ఎన్నికల అఫిడవిట్లో బహిరంగంగా ప్రకటించిన తమ ఆస్తులు, ఇండ్లు, వ్యవసాయ భూములపైకి సర్వే అంటూ వెళ్తున్న కాంగ్రెస్ నాయకులకున్న ఆస్తుల్లో తమకు సగం కూడా లేవని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని కొండలను తవ్వారు..? ఎన్ని ఎలుకలను పట్టారు..? అంటూ ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

