Jagadish Reddy | ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లేందుకు సిద్ధం: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుడినని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లేదని చెప్పారు.
నల్లగొండ: తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుడినని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్‌కు లేదని చెప్పారు. వారిద్దరికి బ్రోకర్లు అని పేరుందన్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. అన్నదమ్ముళ్లు ఇద్దరు కలిసి నల్లగొండ జిల్లా అన్నదాతలను మోసం చేశారన్నారు. సాగర్ నీళ్లను ఆంధ్రకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. వైఎస్ ఇచ్చిన భిక్షతో బతికినోళ్లు.. కేసీఆర్‌పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. లేదంటే బట్టలూడదీసి కొడతామంటూ హెచ్చరించారు.
కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి ఓటెయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని ఫైర్ అయ్యారు. తన చరిత్ర ఏమిటో, కోమటిరెడ్డి బ్రదర్స్ చరిత్ర ఏంటో చర్చ పెడదామా అంటూ సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సోదరులు నల్లగొండ
జిల్లాకు పట్టిన శని అని, వారికి సంస్కారం లేదన్నారు. ప్రజల ముందు వారి బండారం బయటపెడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ బీజేపీ మనిషేనని, కమలం పార్టీలోకి పోతాడని కాంగ్రెస్ మంత్రులే లీకులు ఇస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

