KTR | ఓట్ల నాడు ఒక మాట.. నాట్ల నాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ నైజం: కేటీఆర్
ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని, దగా, నయవంచన అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్: ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని, దగా, నయవంచన అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్యారెంటీ కార్డులో వరిపంటకు రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా అంటూ ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అని సామాజిక మాధ్యం ఎక్స్ వేదికగా విమర్శించారు.
‘నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు, కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు
రూ.15 వేలు రైతుభరోసా అన్నారు.. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు అన్నారు.. కానీ వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు.
ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం. అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో
గారడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు. ఎద్దేడ్సిన యవుసం, రైతేడ్చిన రాజ్యం నిలబడదు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు, తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు, కపట కాంగ్రెస్‌పై సమరశంఖం పూరిస్తారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన..
గ్యారెంటీ కార్డులో..
“వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి..
ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని
సన్నాయి నొక్కులు నొక్కుతారా ??ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి..
ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ??ఇది ప్రజా పాలన కాదు..… pic.twitter.com/9GZoIIFJyz
— KTR (@KTRBRS) May 21, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

