ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లో అక్రమాలు
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, జీవో 550ని సక్రమంగా అమలు చేయటం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో అవకతవకలు
- ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి విచారణ చేయాలి
- ఆర్ కృష్ణయ్య డిమాండ్.. వైద్యారోగ్యశాఖ మంత్రికి వినతి
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, జీవో 550ని సక్రమంగా అమలు చేయటం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. జీవో 550 ప్రకారం ఎకువ మారులు ఉండి ఓపెన్ కాంపిటీషన్లో వచ్చే అభ్యర్థులను రిజర్వేషన్ కింద లెకించవద్దని, ఓపెన్ కాంపిటీషన్లో వచ్చిన అభ్యర్థి కాలేజీ ఆప్షన్ మార్చుకొని ఇంకొక కాలేజీకి వెళితే ఖాళీఅయిన ఆ సీటును అదే క్యాటగిరీకి చెందిన అభ్యర్థికి ఇవ్వాలని తెలిపారు.
గత 19 ఏండ్లుగా దాని ప్రకారమే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిందని, ప్రస్తుతం హెల్త్ యూనివర్సిటీ అధికారులు దానికి తూట్లు పొడుతున్నారని ధ్వజమెత్తారు. జీవోను సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల 262 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంబీబీఎస్ సీట్లు దకకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హెల్త్ యూనివర్సిటీ మెట్రిక్స్ అమర్చిన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని ఆరోపించారు. ఇప్పటికైనా జీవో 550 యథాతథంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో గుజ్జ కృష్ణ రాజేందర్, నందగోపాల్, భూపేశ్‌సాగర్, రాజ్‌కుమార్, రఘుపతి, పర్వతాలు, బలరాం, నిఖిల్ పటేల్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

