గుడ్లలో నాణ్యత లేకుంటే చర్యలు
అంగన్వాడీ కేంద్రాలకు అందించే గుడ్ల పంపిణీ విషయంలో నాణ్యత పాటించకుంటే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి హెచ్చరించారు.
- మహబూబాబాద్ జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి హెచ్చరిక
- అంగన్వాడీ సెంటర్లో కుళ్లిన గుడ్లపై విచారణ
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
బయ్యారం, జూన్ 11: అంగన్వాడీ కేంద్రాలకు అందించే గుడ్ల పంపిణీ విషయంలో నాణ్యత పాటించకుంటే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట అంగన్వాడీ-2 సెంటర్లో కుళ్లిన గుడ్లను పంపిణీ చేయడంతో ఓ చిన్నారి తల్లి అస్వస్థతకు గురికావడంపై ‘అంగన్వాడీ సెంటర్లలో కుళ్లిన గుడ్లు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం కథనాన్ని ప్రచురించింది.
స్పందించిన జిల్లా సంక్షేమ అధికారి సెంటర్‌ను సందర్శించి అంగన్వాడీ టీచర్ మల్లికాంబ నుంచి వివరాలు సేకరించారు. చిన్నారి తల్లికి ఎన్ని గుడ్లు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? అనే విషయంపై రికార్డులను పరిశీలించారు. అనంతరం గుడ్లు పాడైపోయిన తీరును చిన్నారి తల్లి స్రవంతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత, గత నెలలో మిగిలిన గుడ్లను పంపిణీ చేయడంతో సమస్య తలెత్తిందని తెలిపారు. ఏసీడీపీవో విజయలక్ష్మి ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

