TSBIE | ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు
TSBIE | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 29, 30న జరగాల్సిన పరీక్షలను ఈ నెల 31, నవంబర్ 1వ తేదీకి మార్చారు.

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 29, 30న జరగాల్సిన పరీక్షలను ఈ నెల 31, నవంబర్ 1వ తేదీకి మార్చారు.
అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్, 26న ఇంగ్లీష్, 27న మ్యాథ్స్-1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్, 28న మ్యాథ్స్-1బీ, జువాలజీ, హిస్టరీ, 31న ఫిజిక్స్, ఎకనామిక్స్, నవంబర్ 1న కెమిస్ట్రీ, కామర్స్, 2న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 3న మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్లకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
తెలంగాణలో అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు గతంలో ప్రకటించిన విషయం విదితమే. 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన ఫస్టియర్ విద్యార్థులకు (ప్రమోటై ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న విద్యార్థులు) పరీక్షలు నిర్వహించనున్నారు.70 శాతం సిలబస్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటామన్నారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఒకట్రెండు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏఎన్ఎం లేదా స్టాఫ్ నర్సు అందుబాటులో ఉండనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

