ఐబీ హెచ్చరికలు.. రాష్ట్ర పోలీసులు అప్రమత్తం
హైదరాబాద్ : పంద్రాగస్టు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు నగరంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. ఢిల్లీతో పాటు కీలక నగరాలను పాకిస్తాన్ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘా పెంచనున్నారు.
ఇదిలా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో 10వేలమందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగే ఎర్రకోట చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలపై షూటర్లను మోహరించడంతో పాటు నో ఫ్లయింగ్ జోన్లు అమలు చేస్తున్నారు. గాలి పటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురవేయకుండా నిషేధం విధించగా.. నగరవ్యాప్తంగా వెయ్యికిపైగా అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి
భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

