మత్స్యకారులందరికీ బీమా ధీమా

- ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది
- కారణమేదైనా సరే మరణిస్తే రూ.2 లక్షలు
- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
- 105 కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): మత్స్య సహాకారం సంఘాల్లో నమోదైన సభ్యులందరికీ ప్రమాద బీమా పథకం వర్తింప జేయనున్నట్టు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించి మత్స్యకారులు చెల్లించాల్సిన ప్రీమియ మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తదని స్పష్టంచేశారు. మరణించిన మత్స్యకార కుటుంబాలకు శనివారం హైదరాబాద్ హరిత ప్లాజాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. మొత్తం 105 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే మత్స్యకారుల కోసం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేయడంతోపాటు సబ్సిడీలో మోటార్ సైకిళ్లు, ఆటోలు, మొబైల్ ఫిష్ ఔట్లెట్స్ అందిస్తున్నట్టు చెప్పారు. 2021-22 సంవత్సరానికి మత్స్యకారులకు బీమా కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.97.58 లక్షల ప్రీమియం చెల్లించిందని, ఈ పథకంలో 3,36,799 మందిని అర్హులుగా గుర్తించినట్టు వివరించారు. కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్, పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనిత రాజేం ద్ర, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

