జన్యులోపాలతోనూ వంధ్యత్వం
ఏ భార్యాభర్తలకైనా సంతానం అనేది గొప్ప అనుభూతినిచ్చే అంశం. కుటుంబ, సామాజిక అంశాలను ప్రభావితం చేసే సంతానం విషయంలో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ పరిశోధన సంస్థ కీలక విషయాన్ని గుర్తించింది.
- ప్రతి ఏడు జంటల్లో ఒక జంటకు సంతానలేమి సమస్యలు
- వంధ్యత్వాన్ని కలిగిస్తున్న 8 కొత్త జన్యువుల గుర్తింపు
- సీసీఎంబీ అధ్యయనంలో కొత్త విషయాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఏ భార్యాభర్తలకైనా సంతానం అనేది గొప్ప అనుభూతినిచ్చే అంశం. కుటుంబ, సామాజిక అంశాలను ప్రభావితం చేసే సంతానం విషయంలో సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ పరిశోధన సంస్థ కీలక విషయాన్ని గుర్తించింది. ప్రతి ఏడు జంటల్లో ఒక జంటను ఇన్ ఫర్టిలిటీ సమస్యలు వెంటాడుతున్నట్టు తేల్చింది. దీనికి గల కారణాలను అధ్యయనం చేసిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు, మగవారిలో వంధ్యత్వానికి కారణమైన 8 కొత్త జన్యువులను గుర్తించారు.
ముఖ్యంగా మగవారిలోనే 50 శాతానికి పైగా వంధ్యత్వ సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. పునరుత్పత్తి వ్యవస్థలో ఇబ్బందులు, వీర్య కణాల్లో లోపం, హార్మోనల్ అసమతుల్యత, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి మార్పులు సంతాన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుండగా, తాజాగా సీసీఎంబీ అధ్యయనంలో జన్యుపరమైన సమస్యల వల్ల కూడా ఇబ్బందులు ఉంటున్నాయని గుర్తించారు. మగవారిలో గత 20 ఏండ్లుగా వంధ్యత్వం పెరిగింది. 38 శాతం మగవారిలో ప్రత్యేక కారణాలు లేదా క్రోమోజోముల్లో అసాధారణ పరిస్థితులు, ఇతర జన్యుపరమైన అంశాలు ప్రభావితం చేస్తున్నాయని వెల్లడైంది. ఈ అధ్యయనాన్ని తాజాగా హ్యూమన్ మాలిక్యులార్ జెనెటిక్స్ జర్నల్ ప్రచురించింది.
8 కొత్త జన్యువులు
పునరుత్పత్తిపై జన్యువుల ప్రభావంపై సీసీఎంబీలో పీహెచ్డీ స్కాలర్ డాక్టర్ సుధాకర్ దిగుమర్తి అధ్యయనం చేశారు. ఇన్ ఫర్టిలిటీ వంటి సమస్యలపై పరిశోధనల కోసం జన్యువులను సీక్వెన్స్ చేసి అనంతరం వంధ్యత్వం ఉన్న పురుషుల్లోని 47 ముఖ్యమైన జన్యు కణాలను గుర్తించారు. ఇన్ ఫెర్టిలిటీ ఉన్న 1,500 మంది పురుషుల్లో జన్యుపరమైన మార్పులు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో బీఆర్డీటీ, సీఈటీఎన్-1, క్యాట్స్పెర్డ్, జీఎంసీఎల్1, ఎస్పీఏటీఏ6, టీఎస్‌ఎస్‌కే4, టీఎస్‌కేఎస్, జడ్ఎన్ఎఫ్318 జన్యువులను కొత్తగా గుర్తించారు. గతంలో ఇవి వెలుగులోకి రాలేదని, వీటిలో వేరియంట్లు కూడా ఉన్నాయని దిగుమూర్తి తెలిపారు. వీటితోనే వీర్యకణాల ఉత్పత్తి ప్రభావితం అవుతున్నదని వెల్లడించారు. ఇందులో సీఈటీఎన్1 జన్యువులో వస్తున్న మార్పులతోనే వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతున్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

