Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి.. ఇండ్లు కట్టకుండానే బిల్లులు లేపిన అధికారులు
ఇందిరమ్మ ఇండ్లు కట్టకుండానే కట్టినట్టు చూపించి బిల్లులు డ్రా చేసుకున్న అక్రమార్కులను న్యాయస్థానం కటకటాల్లోకి పంపింది. కాంగ్రెస్ పాలనలో ఇండ్లు కట్టకుండానే అవినీతికి పాల్పడిన వారికి మూడేండ్ల జైలుశిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
- రుజువైన నేరం.. అక్రమార్కులకు జైలు
- కాంగ్రెస్ హయాంలో రూ.62 లక్షల అవినీతి
- నలుగురు దోషులకు మూడేండ్ల జైలుశిక్ష, జరిమానా
Indiramma Indlu | లింగంపేట, జూన్19: ఇందిరమ్మ ఇండ్లు కట్టకుండానే కట్టినట్టు చూపించి బిల్లులు డ్రా చేసుకున్న అక్రమార్కులను న్యాయస్థానం కటకటాల్లోకి పంపింది. కాంగ్రెస్ పాలనలో ఇండ్లు కట్టకుండానే అవినీతికి పాల్పడిన వారికి మూడేండ్ల జైలుశిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. లింగంపేట ఎస్సై చైతన్యకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకం తీసుకొచ్చింది. ఉమ్మడి శెట్పల్లిసంగారెడ్డి పంచాయతీ పరిధిలోని ఎక్కపల్లి, ఎక్కపల్లి తండా, సజ్జన్పల్లి, లొంకల్‌పల్లి, మాలపాటి తదితర గ్రామాల్లోని లబ్ధిదారులకు 90 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి.
లబ్ధిదారులు ఇండ్లు కట్టకపోయినప్పటికీ గృహనిర్మాణశాఖ అధికారులు వారి సంతకాలను ఫోర్జరీ చేసి బిల్లులు డ్రా చేశారు. ఇందిరమ్మ గృహాల్లో అవినీతి జరిగినట్టు అరోపణలు రావడంతో విచారణ జరిపిన డీఈఈ గంగాధర్ శెట్పల్లిసంగారెడ్డి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో రూ.62 లక్షల అవినీతి జరిగినట్టు నివేదించారు. డీఈఈ నివేదిక ఆధారంగా గృహనిర్మాణశాఖ ఈఈ చైతన్యకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గృహ నిర్మాణశాఖ అధికారులతోపాటు గ్రామ వాలంటీర్లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఎల్లారెడ్డి కోర్టు మేజిస్ట్రేట్ హారిక బుధవారం తీర్పు వెలువరించారు. గృహనిర్మాణ శాఖ ఏఈలు సంపత్‌కుమార్, బిక్లాల్తోపాటు గ్రామ వాలంటీర్లు వజ్రమ్మ, రాజమణిలకు మూడేండ్ల జైలుశిక్షతోపాటు రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

