ఫిన్లాండ్లో తెలుగు విద్యార్థి మృతి?
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లిన తెలుగు విద్యార్థి మృత్యువాతపడ్డారు. వనస్థలిపురం వైదేహీనగర్లో నివాసముండే గుజ్జ ముత్యంరెడ్డి, మమత దంపతుల కుమారుడు గుజ్జ మణిదీప్రెడ్డి 9నెలల క్రితం ఇంజినీరింగ్ చదివేందుకు ఫిన్లాండ్ దేశం వెళ్లాడు.
- మృతదేహం తమ కుమారుడిది కాదంటున్న తల్లిదండ్రులు
వనస్థలిపురం, జూలై 11 : ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్ దేశానికి వెళ్లిన తెలుగు విద్యార్థి మృత్యువాతపడ్డారు. వనస్థలిపురం వైదేహీనగర్లో నివాసముండే గుజ్జ ముత్యంరెడ్డి, మమత దంపతుల కుమారుడు గుజ్జ మణిదీప్రెడ్డి 9నెలల క్రితం ఇంజినీరింగ్ చదివేందుకు ఫిన్లాండ్ దేశం వెళ్లాడు. మే 5 నుంచి మనుదీప్తో కమ్యూనికేషన్ లేకుండాపోవడంతో తల్లిదండ్రులు తమ కుమారుడు చదువుతున్న కళాశాలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుడాపోయింది.
అనంతరం జూన్ 10వ తేదీన సీఎం రేవంత్రెడ్డి కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో.. వారు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఫిన్లాండ్లోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ మనుదీప్ కోసం దర్యాప్తు ప్రారంభించింది. ఈనెల 9వ క్రూనువోరెంటా సముద్ర తీరంలో ఒక మృతదేహం లభించింది. దానిని పరిశీలించిన అక్కడి అధికారులు మనుదీప్ మృతదేహంగా గుర్తించారు. కాగా, తల్లిదండ్రులు మాత్రం ఆ మృతదేహం తమ కుమారుడిది కాదని చెబుతున్నారు.
తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మే 5న అదృశ్యమైన మణిదీప్.. 65 రోజుల తర్వాత సముద్రంలో ఎలా దొరుకుతాడని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును మూడు వారాల్లో పూర్తి చేయాలని ఫిన్లాండ్ దేశంలో ఆదేశాలు ఉన్నాయని, అందుకే కేసును మూసివేసేందుకు ఎవరో మృతదేహాన్ని తమ కుమారుడిదిగా చెప్పి నమ్మించేందుకు అక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఆ దేశానికే చెందిన ఓ వ్యక్తిపై తమకు అనుమానం ఉన్నదని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. తమ కుమారుడి ఆచూకీ దొరికేవరకు ప్రయత్నాలు ఆపబోమని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని మణిదీప్రెడ్డి తండ్రి ముత్యంరెడ్డి కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

