IIHT | తెలంగాణకు ఐఐహెచ్‌టీ మంజూరు.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
IIHT | తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని (IIHT) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐఐహెచ్‌టీతో జౌళీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందన్నారు.
IIHT | తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని (IIHT) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐఐహెచ్‌టీతో జౌళీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందన్నారు. ఐఐహెచ్‌టీతో రాష్ట్ర విద్యార్థులకు కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో చేనేత, జౌళి పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది కుటుంబాలు జీవిస్తున్నాయి. ఏళ్లుగా సంప్రదాయ పద్ధతులను నమ్మకొని మగ్గాలపై చీరెలు, చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ పెద్ద ఎత్తున వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చేనేత సాంకేతిక కోర్సుల వైపు చూస్తుండగా.. రాష్ట్రంలో కోర్సులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ చేనేత నైపుణ్య విద్యాసంస్థగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT)కి పేరుంది. విద్యకు ఐఐటీ మాదిరిగా చేనేతకు ఐఐహెచ్‌టీని పరిగణిస్తుండగా.. ఇందులో కోర్సులకు మంచి డిమాండ్ ఉన్నది. ఈ క్రమంలో భూదాన్ పోచంపల్లిలో ఐఐహెచ్‌టీని నెలకొల్పాలని బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఐఐహెచ్‌టీకి భారీ డిమాండ్ ఉండడంతో తెలంగాణలోనూ ఐఐహెచ్‌టీని నెలకొల్పాలని బీఆర్ఎస్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. అప్పటి చేనేత జౌళీశాఖ మంత్రి కేటీఆర్ సైతం కేంద్రమంత్రులకు లేఖలు సైతం రాసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఎట్టకేలకు ఫలితం దక్కినట్లయ్యింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

