రైతుల కోసం తెలంగాణ త్యాగం
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని, ఉచిత విద్యుత్తునందిస్తూ, రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడుతూ, డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకుంటూ.. తెలంగాణ ప్రభుత్వం గొప్ప త్యాగం చేసింది. కేంద్రం కత్తిగట్టి సంస్కరణలు పేరిట నిధులిస్తామని బేరంపెట్టినా.. తమకు కేంద్రం విదిల్చే డబ్బులు అవసరంలేదని ఆర్థిక త్యాగానికి సిద్ధపడింది.
- వేల కోట్ల ప్రోత్సాహం వదులుకున్న రాష్ట్రం
- విద్యుత్తు సంస్కరణలు వద్దనడంపై కోత
- జీఎస్డీపీలో 0.5 శాతం నిధులు లాస్
- సంస్కరణల రాష్ట్రాలకు కేంద్రం తాయిలం
- 1,43,332 కోట్లు విడుదల చేసిన కేంద్రం
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని, ఉచిత విద్యుత్తునందిస్తూ, రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడుతూ, డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకుంటూ.. తెలంగాణ ప్రభుత్వం గొప్ప త్యాగం చేసింది. కేంద్రం కత్తిగట్టి సంస్కరణలు పేరిట నిధులిస్తామని బేరంపెట్టినా.. తమకు కేంద్రం విదిల్చే డబ్బులు అవసరంలేదని ఆర్థిక త్యాగానికి సిద్ధపడింది. కేంద్రం ఇచ్చే కోట్లు తమకు ముఖ్యం కాదని రైతుల సంక్షేమం, ప్రభుత్వ సంస్థలను నిలుపుకోవటమే ముఖ్యమని కేసీఆర్ ప్రభుత్వం చాటిచెప్పింది.
సంస్కరణలకు ఒప్పుకోనందుకు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్తు సంస్కరణలు అమలు చేసేది లేదని రాష్ట్రప్రభుత్వం కరాకండిగా తేల్చి చెప్పింది. ఫలితంగా రాష్ట్రాలకు కేంద్రం తాజాగా ప్రకటించిన ఆర్థిక ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్) రూపంలో తెలంగాణ రాష్ట్రం భారీగా నష్టపోయింది. కేంద్రం చెప్పినట్టు నడుచుకుని, విద్యుత్తు సంస్కరణలు అమలు చేసిన రాష్ర్టాలకు కేంద్రం ఇన్సెంటివ్ రూపంలో తాయిలాలు ప్రకటించింది. 12 రాష్ర్టాలకు రూ.1,43,332 కోట్ల ఇన్సెంటివ్‌లను బుధవారం మంజూరు చేసింది. వీటిలో సంస్కరణలు అమలు చేసినందుకు ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 0.5 శాతం ఇచ్చే మొత్తం కూడా దాదాపు రూ. 66,413 కోట్లు ఉండటం గమనార్హం. రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా, డిస్కంలను ప్రైవేటీకరించడానికి దారులు తెరిచేలా ఉన్న సంస్కరణలను అమలు చేయనందుకు తెలంగాణ త్యాగం చేసి, వేల కోట్ల నిధులను వదులుకున్నది. తమకు సంస్కరణలు ముఖ్యంకాదని రైతుల సంక్షేమమే ముఖ్యమని చాటుకున్నది. కేంద్రం తాజాగా కేటాయించిన ఇన్సెంటివ్‌లలో 2021-22, 2022-23 మధ్యలో అదనపు రుణ పరిమితితో పశ్చిమబెంగాల్ అత్యధికంగా రూ.15,263 కోట్లను కేంద్రం నుంచి ఇన్సెంటివ్‌గా అందుకున్నది. ఇక ఆ తర్వాత రాజస్థాన్ రూ.11,308 కోట్లతో రెండోస్థానంలో ఉండగా, మణిపూర్ రూ.180 కోట్లు, మిజోరాం రూ.192 కోట్లతో చివరి రెండుస్థానాల్లో ఉన్నాయి.
తృణప్రాయంగా వదులుకున్న తెలంగాణ
2021-22 నుంచి 2024-25 మధ్యకాలంలో విద్యుత్తు సంస్కరణల అమలుచేస్తే.. రాష్ట్ర జీఎస్డీపీలో 0.5 శాతం ఆర్థిక ప్రోత్సాహకాలిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇలా నాలుగేండ్ల పాటు ఈ ప్రోత్సాహకాలివ్వనున్నట్టు కేంద్రం వెల్లడించింది. అమలుచేసే సంస్కరణలను బట్టి అదనపు ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం, ప్రభుత్వరంగంలోని విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించడం, విద్యుత్తు రాయితీలను రద్దుచేయడం, క్రాస్ సబ్సిడీని ఎత్తివేయడం వంటి సంస్కరణలున్నాయి. అయితే రాష్ట్ర ప్రజానీకం విస్తృత ప్రయోజనాలను కాంక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఈ సంస్కరణలను మొదటి నుంచి వ్యతిరేకించింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ తన గొంతులో ప్రాణమున్నంత వరకు మోటార్లకు మీటర్లు బిగించమని కుండబద్ధలు కొట్టారు. ఒక వేళ ఈ సంస్కరణలు రాష్ట్రం అమలుచేసి ఉంటే కేంద్రం నుంచి కోట్లాది రూపాయలు వచ్చేవి. కాని వీటిని ప్రజల కోసం తృణప్రాయంగా వదులుకునేందుకు రాష్ట్రం సిద్ధపడింది. ప్రభుత్వ రంగంలోనే విద్యుత్తు సంస్థలను నడుపుతామని, ప్రజలు, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటించటమే కాదు.. ఆచరించి చూపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

