ఇసుక మాఫియా బరితెగింపు
రోజురోజుకూ ఇసుక మాఫి యా బరితెగిస్తున్నది. అడ్డొస్తున్న పోలీసు లు, అధికారులను హతమార్చేందుకు తెగబడుతున్నది.
- కానిస్టేబుల్ సహా ట్రాక్టర్‌ను చెరువులో వేసేందుకు యత్నం
- కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
- నామాపూర్‌లో 5 ట్రాక్టర్లు సీజ్
ముస్తాబాద్, జూన్ 25: రోజురోజుకూ ఇసుక మాఫి యా బరితెగిస్తున్నది. అడ్డొస్తున్న పోలీసు లు, అధికారులను హతమార్చేందుకు తెగబడుతున్నది. మొన్న వేములవాడలో మైనింగ్ అధికారులపై జరిగిన దాడి ఘటన మరువక ముం దే.. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్న ఓ కానిస్టేబుల్‌ను హతమార్చేందుకు యత్నించింది. ట్రాక్టర్ ఇంజిన్ బానెట్‌పై కూర్చున్న కానిస్టేబుల్‌ను వాహనంతోసహా చెరువులో పడేసేందుకు డ్రైవర్ యత్నించాడు. పసిగట్టిన కానిస్టేబుల్ దూకడంతో గాయాలు కాగా.. ట్రాక్టర్ చెరువులో పడిపోయింది. సిరిసిల్ల రూరల్ సీఐ సదన్‌కుమార్ వివరాలు వెల్లడించారు.
రామలక్ష్మణులపల్లె మానేరు వా గు నుంచి రాంరెడ్డిపల్లె మీదుగా నామాపూ ర్ వేల చెరువు కట్టపై నుంచి అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేర కు మంగళవారం ఉదయం ఎస్సై శేఖర్‌రెడ్డి సిబ్బందితో వెళ్లి ఐదు ఇసుక ట్రాక్టర్ల ను పట్టుకున్నారు. నాలుగు ట్రాక్టర్లను ఎ స్సై, సిబ్బంది ఠాణా కు తరలించారు. ఐదో ట్రాక్టర్ బానెట్‌పై డ్రైవర్ పక్కన కానిస్టేబుల్ సత్యనారాయణ కూర్చోని స్టేషన్‌కు తరలిస్తున్నాడు. ట్రాక్టర్‌ను సీజ్ చేస్తారని, తప్పించుకోవాలని డ్రైవర్ భూక్య గురుబా బు.. చెరువుకట్ట పైనుంచి ట్రాక్టర్‌ను వేగం గా నడిపి డ్రైవర్‌ను చెరువులో పడేసేందుకు యత్నించాడు.
పసిగట్టిన కానిస్టేబుల్ ట్రాక్టర్‌పై నుంచి దూకేశాడు. ట్రాక్టర్ చెరువులో పడిపోగా.. డ్రైవర్ అక్కడి నుం చి పరారయ్యాడు. వెనుక వచ్చే ట్రాక్టర్ కనిపించకపోవడం, అరుపులు వినిపించడంతో పోలీసులు వెనక్కివచ్చారు. గాయాలై రక్తపు మడుగులో ఉన్న సత్యనారాయణను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. గురుబాబుపై అనేక కేసులున్నాయని, పలు సార్లు ఇసుక తరలిస్తూ పట్టుబడ్డాడని, 2013లో మర్డర్ కేసు, భూతగాదా కేసులు ఉన్నాయని, రౌడీషీట్ కూడా ఉందని వివరించా రు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని, ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

