తెలంగాణలో ఏపీ ఇసుక దందా
సరిహద్దులు దాటించి అక్రమ రవాణా తెలంగాణ ఆదాయానికి భారీగా గండి రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, ఒంగోలు నుంచి రోజూ 200 లారీల రాక ఏడాదికి 111 కోట్ల ఆదాయానికి గండి చోద్యం చూస్తున్న టీజీఎండీసీ హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా దందా మూడు ట్రిప్పులు, ఆరు డంపుల్లా నిత్యం సాగుతున్నది. ఏపీలోని రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి ఇసుకను అడ్డగోలుగా తెలంగాణకు తరలిస్తున్నారు. రాజమండ్రి నుంచి వస్తున్న ఏపీ ఇసుక వాహనాలు సత్తుపల్లి వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే మీదుగా ఖమ్మం, సూర్యాపేట, తిరుమలగిరి, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి నందిగామ, జగ్గయ్యపేట, కోదాడ, సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. అనంతపురం నుంచి కర్నూలు, జడ్చర్ల మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఏపీ నుంచి తరలిస్తున్న ఇసుకను హైదరాబాద్‌లో ఉన్న డంపుల వద్ద దర్జాగా అన్లోడ్ చేసి వెళ్తున్నారు. ఏపీ బార్డర్లో నెలవారీగా కొంత మంది అధికారులు లారీకి ఇంత అని రేట్ ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ఫిల్టర్ ఇసుకను అడ్డగోలుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి ఏపీ నుంచి రోజూ తెలంగాణకు 200 వరకు ఇసుక లారీలు వస్తున్నట్టు తెలిసింది. ఒక్కొక్క లారీకి రూ.15,550 ధర పలుకుతుండగా, ఒక్క రోజుకే రూ.31,10,000 తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నది. ఈ లెక్కన ప్రతి నెలా రూ.9,33,00,000, ఏడాదికి రూ.111 కోట్ల మేర సర్కార్ ఖజానాకు గండి పడుతున్నది. ఏపీ నుంచి తెలంగాణకు అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అధికారుల కనుసన్నల్లో సాగుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. లోడింగ్ పేరిట భారీగా వసూళ్లు మరోవైపు టీజీఎండీసీ నిర్వహిస్తున్న ఇసుక క్వారీల్లో లోడింగ్ పేరిట కాంట్రాక్టర్లు ఒక్కో లారీకి ముక్కుపిండి రూ.2,500 చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో కాంట్రాక్టర్లు ఏడాదికి 2,000 లారీల వద్ద నుంచి మొత్తం రూ.182 కోట్లు జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తం రాష్ట్ర ఆదాయానికి గండిపడుతున్నా.. మరోవైపు కాంట్రాక్టర్లు లోడింగ్ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో తూలుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నిసార్లు టీజీఎండీసీ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంతోపాటు లోడింగ్ పేరిట కాంట్రాక్టర్లు సాగిస్తున్న వసూళ్ల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
- సరిహద్దులు దాటించి అక్రమ రవాణా
- తెలంగాణ ఆదాయానికి భారీగా గండి
- రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, ఒంగోలు నుంచి రోజూ 200 లారీల రాక
- ఏడాదికి 111 కోట్ల ఆదాయానికి గండి
- చోద్యం చూస్తున్న టీజీఎండీసీ
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా దందా మూడు ట్రిప్పులు, ఆరు డంపుల్లా నిత్యం సాగుతున్నది. ఏపీలోని రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి ఇసుకను అడ్డగోలుగా తెలంగాణకు తరలిస్తున్నారు. రాజమండ్రి నుంచి వస్తున్న ఏపీ ఇసుక వాహనాలు సత్తుపల్లి వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే మీదుగా ఖమ్మం, సూర్యాపేట, తిరుమలగిరి, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి నందిగామ, జగ్గయ్యపేట, కోదాడ, సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది.
అనంతపురం నుంచి కర్నూలు, జడ్చర్ల మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఏపీ నుంచి తరలిస్తున్న ఇసుకను హైదరాబాద్‌లో ఉన్న డంపుల వద్ద దర్జాగా అన్లోడ్ చేసి వెళ్తున్నారు. ఏపీ బార్డర్లో నెలవారీగా కొంత మంది అధికారులు లారీకి ఇంత అని రేట్ ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ఫిల్టర్ ఇసుకను అడ్డగోలుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం.
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
ఏపీ నుంచి రోజూ తెలంగాణకు 200 వరకు ఇసుక లారీలు వస్తున్నట్టు తెలిసింది. ఒక్కొక్క లారీకి రూ.15,550 ధర పలుకుతుండగా, ఒక్క రోజుకే రూ.31,10,000 తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నది. ఈ లెక్కన ప్రతి నెలా రూ.9,33,00,000, ఏడాదికి రూ.111 కోట్ల మేర సర్కార్ ఖజానాకు గండి పడుతున్నది. ఏపీ నుంచి తెలంగాణకు అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) అధికారుల కనుసన్నల్లో సాగుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
లోడింగ్ పేరిట భారీగా వసూళ్లు
మరోవైపు టీజీఎండీసీ నిర్వహిస్తున్న ఇసుక క్వారీల్లో లోడింగ్ పేరిట కాంట్రాక్టర్లు ఒక్కో లారీకి ముక్కుపిండి రూ.2,500 చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో కాంట్రాక్టర్లు ఏడాదికి 2,000 లారీల వద్ద నుంచి మొత్తం రూ.182 కోట్లు జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తం రాష్ట్ర ఆదాయానికి గండిపడుతున్నా.. మరోవైపు కాంట్రాక్టర్లు లోడింగ్ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో తూలుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నిసార్లు టీజీఎండీసీ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంతోపాటు లోడింగ్ పేరిట కాంట్రాక్టర్లు సాగిస్తున్న వసూళ్ల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

