IICT Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తక్కువ ఖర్చుతో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంపై హైదరాబాద్‌లోని ఐఐసీటీ పరిశోధకులు దృష్టి సారించారు. కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ (ఆర్టిఫీషియల్ ఫొటోసింథసిస్) ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్‌ను ఉత్పత్తికి నూతన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు.
కాడ్మియం సల్ఫైడ్, సెమీకండక్టర్లతో కూడిన ఈ ఆకులపై సూర్యరశ్మి పడిన వెంటనే కాడ్మియం ఉత్ప్రేరకంగా పనిచేసి రసాయనిక చర్య జరుగుతుందని, తద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. చాలా తక్కువ ఖర్చుతో పారిశ్రామిక అవసరాలకు హైడ్రోజన్‌ను తయారు చేసుకోవచ్చని చెప్తున్నారు.