అభివృద్ది కావాలంటే మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
Minister Yerrabelli| తెలంగాణ మాదిరిగానే మునుగోడు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.
చండూరు : తెలంగాణ మాదిరిగానే మునుగోడు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు 2, 3వ వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌అన్ని వర్గాలకు అందిస్తున్నారని తెలిపారు. తన స్వార్థం కోసం వేల కోట్లకు అమ్ముడుపోయిన కొందరు ఎన్నికలను తీసుకొచ్చిన బీజేపీ అభ్యర్థిని ఓడించాలని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని అన్నారు. ఇంటి పార్టీ టీఆర్ఎస్ను, అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి దేశంలోనే ఎవరూ చేయలేదని అన్నారు.
మిషన్ భగీరథతో మునుగోడు లో ఫ్లోరైడ్ లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. అభివృద్ధి గురించి పట్టించుకోని ఇంతవరకు నియోజకవర్గాన్ని ఏలిన పార్టీలను రాజకీయాల నుంచి తరమికొట్టాలని పిలుపునిచ్చారు. కారు తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని వివరించారు. మంత్రి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

