Telangana | పథకాలపై ప్రశ్నించాడని.. పరిగెత్తించి తరిమికొట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు
Telangana | కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ పథకాలపై ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా? అంటూ ఓ సాధారణ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశా డు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో ని హన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది.
Telangana | మహబూబ్‌నగర్, అక్టోబర్ 21: కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ పథకాలపై ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా? అంటూ ఓ సాధారణ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో ని హన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తామంటూ చెప్తున్న క్రమం లో.. నియోజకవర్గానికి చెందిన సాధారణ పౌరుడు అహ్మద్.. ‘మీరు చెప్తున్న ఈ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదు’ అని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడాలని కోరాడు. అంతే.. ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు అహ్మద్‌ను సమావేశం నుంచి తరిమికొట్టారు. రోడ్డుపై పరుగులు పెట్టించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానికులు.. కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రశ్నించిన వారిని ఇలా తరిమికొడతారా అంటూ తప్పుపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

