శనివారం 11 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:49:29

వరి అవశేషాల నిర్వహణపై వెబినార్‌

వరి అవశేషాల నిర్వహణపై వెబినార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వరి పంట కోసిన తర్వాత పొలాల్లో మిగిలిపోతున్న అవశేషాల నిర్వహణపై ‘ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఇండియా’ (ఐఈఐ) తెలంగాణ రాష్ట్రశాఖ సోమవారం వెబ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పది మందికిపైగా నిపుణులు వ్యర్థాల నిర్వహణపై చర్చించారు. కార్యక్రమంలో ఐఈఐ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ జీ రామేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


logo