Fake Medicines | నకిలీ మందులను ఎలా గుర్తించాలి? ఔషధాలు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వేసుకునే ఔషధాలు నకిలీవి అయితే.. వ్యాధి తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వరుసగా నకిలీ ఔషధాల తయారీ కంపెనీలపై దాడులు చేస్తూ, వాటిని సీజ్ చేస్తున్నారు.
- కొనే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- చిన్న చిన్న వ్యత్యాసాలతో ఔషధాలను గుర్తించొచ్చు
- డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
- ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నం. 1800599696
Fake Medicines | హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వేసుకునే ఔషధాలు నకిలీవి అయితే.. వ్యాధి తగ్గకపోగా కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వరుసగా నకిలీ ఔషధాల తయారీ కంపెనీలపై దాడులు చేస్తూ, వాటిని సీజ్ చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న నకిలీ మందులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మందులు కొనే సమయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని, ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని డీసీఏ హెచ్చరిస్తున్నది.
ఇటీవల వరుసగా నకిలీ ఔషధాల తయారీ సంస్థలు, రవాణా రాకెట్ పట్టుబడుతున్న నేపథ్యంలో నకిలీ ఔషధాలను ఎలా గుర్తించాలి? ఔషధాలు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలను వివరిస్తూ తాజాగా సూచనలు జారీ చేసింది. అనుమతి లేని దుకాణాలు, అనుమతి లేని వెబ్సైట్ల నుంచి ఔషధాలు కొనుగోలు చేయొద్దని స్పష్టం చేసింది. ప్రతి మెడికల్ షాప్‌లో లైసెన్స్‌ను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, ఈ మేరకు లైసెన్స్‌ను బహిర్గతం చేస్తున్నారో లేదో పరిశీలించాలని సూచిస్తున్నది.
పరిణామాలు ఏమిటంటే..
నకిలీ ఔషధాలతో రోగికి తీవ్ర నష్టం కలుగుతుంది. వ్యాధి తగ్గకపోగా ముదురుతుంది. అందులోని రసాయనాల వల్ల తీవ్ర దుష్పలితాలు కలిగే అవకాశం ఉంటుంది. దీంతో ఔషధాలపై, ఔషధ తయారీ సంస్థలపై నమ్మకం తగ్గుతుంది. ఆ మందులను సిఫారసు చేసే డాక్టర్లు, దవాఖానలపై నమ్మకం సడలుతుంది.
గుర్తించడం ఎలా?
నకిలీ ఔషధాలను గుర్తించేందుకు తెలంగాణ డీసీఏ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఔషధ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. నకిలీ మందులు నిజమైన ఉత్పత్తులకు చాలా దగ్గరగా ఉంటాయని, కొన్ని లక్షణాల ఆధారంగా వాటిని గుర్తించవచ్చని చెప్తున్నారు.
పోల్చడం: అసలైన ఔషధాన్ని, నకిలీ ఔషధాన్ని పక్కపక్కన పెట్టి పోల్చినప్పుడు కొన్ని తేడాలు గమనించవచ్చు. ముఖ్యంగా కంపెనీలు ప్యాకింగ్ మార్చినా.. నకిలీ ఔషధాలు పాత ప్యాకింగ్‌లోనే వస్తుంటాయి. పరిమాణం, రంగు, బరువు, క్వాలిటీ, డిజైన్‌లో తేడాలు కనిపిస్తుంటాయి.
స్పెలింగ్ తప్పులు: కంపెనీ పేరు లేదా ఉత్పత్తి పేరు లేదా అందులో ఉన్న రసాయనాల స్పెల్లింగ్ తేడాలు ఉంటాయి. తయారీ తేదీ, గడువు తేదీ, వంటివి ఔషధంతోపాటు బయటి కాటన్‌పై ఉండే వివరాలతో సరిపోల్చుకోవాలి.
చూడటానికి ఒకేలా ఉండాలి: ట్యాబ్లెట్లు షీట్లో ఉన్నా, బాటిల్లో ఉన్నా అన్నీ చూడటానికి ఒకే రకంగా ఉండాలి. పరిమాణంలో తేడాలు ఉండటం, పర్రెలు రావడం, విరిగిపోవడం వంటివి గుర్తిస్తే నకిలీవిగా అనుమానించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, తరుచూ ఔషధాలు వాడేవారు ఎలాంటి తేడాలు ఉన్నా వెంటనే గుర్తిస్తారు. ఇలాంటి సందర్భాల్లో కంపెనీ వివరాలను కచ్చితంగా చెక్ చేయాలి.
అతి తక్కువ ధర: మనం గతంలో తీసుకున్న ధరతో పోల్చినప్పుడు తక్కువగా ఉండటం, తెలిసినవారు తెచ్చుకున్న ధరలతో పోల్చినా తక్కువకు దొరికితే జాగ్రత్త పడాల్సిందే. కొన్నిసార్లు దుకాణాదారు చాలా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చినా అనుమానించాలి.
అధికారిక ముద్ర: 300 రకాల అత్యవసర మందులకు కచ్చితంగా బార్ కోడ్, క్యూఆర్ కోడ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. మందులపై లేదా వాటిని ప్యాక్ చేసిన డబ్బాలపై కోడ్ లేకపోతే అనుమానించాలి.
ప్యాకేజింగ్: బ్రాండెడ్ కంపెనీలు ప్యాకేజింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి మందులు తీసుకునే సమయంలో ప్యాకేజింగ్ సరిగా ఉన్నదా? సీల్ సరిగా ఉన్నదా? అన్నది చూడాలి. లీకేజీలు ఉన్నా, తేడాగా ఉన్నా అనుమానించాలి.
సైడ్ ఎఫెక్ట్స్ : మందు వేసుకున్న తర్వాత అలర్జీలు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
బిల్లు తప్పనిసరి: మందులు కొన్న తర్వాత మెడికల్ షాప్ నుంచి కచ్చితంగా బిల్లు తీసుకోవాలి. అందులో ఏయే ఔషధాలు తీసుకున్నారో వివరంగా ఉండాలి. ఎవరైనా బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తే అనుమానించాల్సిందే. ఫిర్యాదు ఎలా చేయాలి? నకిలీ మందులు గుర్తిస్తే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టోల్ ఫ్రీ నంబర్ 1800599696 కు సమాచారం ఇవ్వవచ్చు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
నకిలీ ఎలా చేస్తారంటే?
సాధారణంగా ప్రజలకు సుపరిచితమైన బ్రాండ్ల ఔషధాలకు నకిలీవి తయారు చేస్తుంటారు. అయితే.. చాలా సందర్భాల్లో వాటిపై ఉనికిలోలేని కంపెనీల పేర్లు, తప్పుడు తయారీ చిరునామాలు ముద్రిస్తుంటారు.
ఔషధాల్లో ఉండే ‘యాక్టివ్ ఇంగ్రేడియెంట్’ మన శరీరంలోకి చేరిన తర్వాత వ్యాధిని నియంత్రిస్తుంది. అయితే.. నకిలీ మందుల్లో యాక్టివ్ ఇంగ్రేడియెంట్ ఉండదు. పిండి, మక్కజొన్న పొడి, ఆలుగడ్డ పొడి వంటివి ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో తప్పుడు యాక్టివ్ ఇంగ్రేడియెంట్ వాడుతారు. ఉదాహరణకు ‘అమాక్సిసిల్లిన్’ ట్యాబ్లెట్లలో ‘పారాసిటమాల్’ నింపుతారు. లేదా తగినంత పరిమాణంలో యాక్టివ్ ఇంగ్రేడియెంట్ ఉండకపోవచ్చు. ఉదాహరణకు 500 మిల్లీ గ్రాముల అమాక్సిసిల్లిన్ ట్యాబ్లెట్లలో 50 మిల్లీ గ్రాములు మాత్రమే ఉండొచ్చు. ఇంకొన్ని ట్యాబ్లెట్లలో హానికారక రసాయనాలు ఉండొచ్చు.
నకిలీ ఔషధాలతో పెనుముప్పు
నకిలీ ఔషధాలతో ప్రజలకు డబ్బులు వృథా అవడంతోపాటు నష్టం కలిగించడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. కొత్త అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే నకిలీ ఔషధాలను కట్టడి చేసేందుకు మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ప్రజలు సహకారం అందిస్తే మరింత సమర్థంగా కట్టడి చేయవచ్చు. లైసెన్స్ లేకుండా ఎవరైనా మందులు అమ్మినా, గోదాముల్లో నిల్వ చేసినా, నకిలీ ఔషధాలు గుర్తించినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
– కమలాసన్ రెడ్డి, డీజీ, డీసీఏ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

