సజ్జల్లోనే ప్రతికూలతను తట్టుకొనే శక్తి
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే శక్తి సజ్జ పంట ఉన్నదని ఇక్రిసాట్ పరిశోధనలో తేలింది. వేగంగా మారే వాతావరణ పరిస్థితుల్లోనూ సజ్జ పంట ద్వారా అధిక దిగుబడిలు సాధించవచ్చని పరిశోధకులు గుర్తించారు.
- కొత్త వంగడాలు, మిల్లెట్ల సాగుపై ఇక్రిసాట్ స్టడీ
- పెరగనున్న మిల్లెట్ల ఉత్పత్తి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే శక్తి సజ్జ పంట ఉన్నదని ఇక్రిసాట్ పరిశోధనలో తేలింది. వేగంగా మారే వాతావరణ పరిస్థితుల్లోనూ సజ్జ పంట ద్వారా అధిక దిగుబడిలు సాధించవచ్చని పరిశోధకులు గుర్తించారు. క్లిష్టమైన వాతావరణం, పర్యావరణ మార్పులు, అధిక వర్షపాతం, తీవ్ర వర్షాభావం వంటి పర్యావరణ విపత్కర పరిస్థితులను తట్టుకొని ఆహార పంటలను సాగు చేసే విధానాలపై ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోని జిల్లాలను పరిగణనలోకి తీసుకొని ప్రామాణికంగా ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. పలు అగ్రికల్చర్ రిసెర్చ్ కేంద్రాలతో కలిసి చేసిన అధ్యయనంలో ైక్లెమేట్ చేంజ్ పరిస్థితులను తట్టుకొనే సామర్థ్యం సజ్జలకు ఉన్నదని పరిశోధకులు కనుగొన్నారు.
దేశంలో ఆహార భద్రత సాధనలో సజ్జలు అత్యంత కీలకంగా మారుతాయని గుర్తించారు. దేశవ్యాప్తంగా సజ్జలు సాగు చేసే ప్రాంతాల్లోని వాతావరణ స్థితిగతుల డాటాను విశ్లేషించి అధ్యయనం చేసినట్టుగా ఇక్రిసాట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిశోధన వ్యవసాయ రంగంపై ైక్లెమేట్ చేంజ్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తుండగా, ముఖ్యంగా డ్రై ల్యాండ్ ప్రాంతాల్లో సజ్జల సాగును ప్రోత్సహించేందుకు సాయపడుతుందని ఇక్రిసాట్ సైంటిస్టులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పంటల సాగుపై అధ్యయనం చేసి, గతంలో ఉన్న పంటల జోన్ల సమాచారాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో ఆధునీకరించారు. ఇప్పటివరకు నేల స్వభావం, వర్షపాతం ఆధారంగానే దేశవ్యాప్తంగా వ్యవసాయ ప్రాంతాలను డెవలప్ చేయగా దీని ద్వారా పంటల సాగును పెంచే ప్రణాళికలను అమలు చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

