చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 18 : జాతీయ భద్రతలో పరిశోధన, ఆవిషరణ, నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రామ్‌గోపాల్‌రావు, ఇక్ఫాయ్ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎల్ఎస్ గణేశ్ సంతకాలు చేశారు.